Share News

ప్రత్తిపాడులో అగ్నిమాపక కేంద్ర భవనం ప్రారంభం

ABN , Publish Date - May 31 , 2024 | 12:48 AM

ప్రత్తిపాడులో అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని గురువారం రాష్ట్ర విపత్తు స్పందన అగ్ని మాపక సేవలశాఖ డైరెక్టర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌ ప్రారంభించారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ వెనుక భాగంలో నూతన అగ్నిమాపక శాఖ భవనాన్ని కాకినాడ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధుల్లో భాగంగా నిర్మించింది. భవనిర్మాణ పనులు నిర్వహించిన కోరమండల్‌ కంపెనీ అధినేత సీహెచ్‌ శ్రీనివాస్‌ను డైరెకర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌ శాలువా కప్పి అభినందించారు.

ప్రత్తిపాడులో అగ్నిమాపక కేంద్ర భవనం ప్రారంభం

ప్రారంభించిన రాష్ట్ర అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌

ప్రత్తిపాడు, మే 30: ప్రత్తిపాడులో అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని గురువారం రాష్ట్ర విపత్తు స్పందన అగ్ని మాపక సేవలశాఖ డైరెక్టర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌ ప్రారంభించారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ వెనుక భాగంలో నూతన అగ్నిమాపక శాఖ భవనాన్ని కాకినాడ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధుల్లో భాగంగా నిర్మించింది. భవనిర్మాణ పనులు నిర్వహించిన కోరమండల్‌ కంపెనీ అధినేత సీహెచ్‌ శ్రీనివాస్‌ను డైరెకర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌ శాలువా కప్పి అభినందించారు. నూతన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అగ్నిమాపక సేవలకు ఈ భవనం మరింతగా తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ పీవీ రమణ, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఈ. స్వామి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్‌.సురేంద్ర, ఏడీఎఫ్‌వోలు ఆనంద్‌, ఎం.శ్రీహరి, జగన్నాధ్‌, వి.సుబ్బారావు, జిల్లాలోని ఎస్‌ఎఫ్‌వో

Updated Date - May 31 , 2024 | 12:56 AM