Share News

పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:02 AM

పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం

పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం

అమలాపురం టౌన్‌, జనవరి 8: పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాం డ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు డిమాండు చేశారు. ప్రాణాలకు తెగించి అరకొర వసతులతో పారిశుధ్య కార్మికులు పనులు చేయాల్సిన పరిస్థితిపై తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మి కులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 13వ రోజుకు చేరుకుంది. అమ లాపురం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరాన్ని టీడీపీ నాయకులతో పాటు పోస్టల్‌, యునైటెడ్‌ వర్కర్స్‌, వివిధ సంఘాల నాయ కులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏఐటీయూసీ జిల్లాశాఖ అధ్య క్షుడు కొప్పుల సత్తిబాబు, తొమ్మండ్రు గోపీల ఆధ్వర్యంలో జరిగిన సమ్మె శిబి రంలో ఎన్‌.మూర్తి, ఎ.ప్రసాద్‌, జి.వరలక్ష్మి, అనంతలక్ష్మి, కొప్పుల బాబి, నిమ్మ కాయల శ్రీను, రాయుడు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ యూని యన్ల నాయకులు రామకృష్ణ, వెంకటేశ్వరరావు, రమేష్‌, వలవల శివరావు, కుసుమ సూర్యమోహనరావు, బత్తుల ప్రసాద్‌ సంఘీభావం తెలిపారు.

Updated Date - Jan 09 , 2024 | 01:02 AM