Share News

టెన్‌షన్‌ పెట్టేస్తున్నారు!

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:17 PM

ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. హాల్‌ టికెట్‌ కోసం వెళ్లగా.. ‘నువ్వు ఇంకా రూ.3500 ఫీజు కట్టాలి. మీ నాన్నను ఆ ఫీజు కట్టేసి హాల్‌ టికెట్‌ తీసుకెళ్లమను’ అని కరాఖండిగా చెప్ప డం తో విద్యార్థి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది.

టెన్‌షన్‌ పెట్టేస్తున్నారు!

ప్రైవేటు పాఠశాలల్లో ఇదీ తీరు

ఫీజులు చెల్లించాలని సందేశాలు

లేకపోతే హాల్‌ టిక్కెట్లు ఇవ్వం

నలిగిపోతున్న విద్యార్థులు

తల్లిదండ్రుల ఉరుకులు.. పరుగులు

జిల్లాలో 29,990 మంది విద్యార్థులు

18 నుంచే పదో తరగతి పరీక్షలు

హాల్‌ టిక్కెట్లు ఆపితే ఊరుకోం

8 అధికారుల హెచ్చరిక

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. హాల్‌ టికెట్‌ కోసం వెళ్లగా.. ‘నువ్వు ఇంకా రూ.3500 ఫీజు కట్టాలి. మీ నాన్నను ఆ ఫీజు కట్టేసి హాల్‌ టికెట్‌ తీసుకెళ్లమను’ అని కరాఖండిగా చెప్ప డం తో విద్యార్థి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయింది. వెలుగు లోకి రాని ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్నా యి. విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు వంటి పదో తర గతి పబ్లిక్‌ పరీక్షలకు ఇంకా వారం రోజులే సమ యం ఉంది. అయితే విద్యార్థులను కొన్ని ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలు ‘హాల్‌టికెట్‌కి ఫీజు బకాయి’కి లంకె పెట్టి ఆందోళనకు గురిచేస్తున్నారు.వాస్తవానికి హాల్‌ టికెట్‌ని కచ్చితంగా విద్యార్థికి అందజేయాలి. ఇతర వ్యవహారాలకు ముడిపెట్టి హాల్‌ టికెట్‌ ఇవ్వ కుండా ఉంటే నేరం చేసినట్లే.కానీ పరీక్షలే అదనుగా ఫీజులను బలవంతంగా రాబట్టుకొనేందుకు తల్లిదండ్రులపై ఒత్తి డి తెస్తున్నారు. బకాయి చెల్లించకపోతే హాల్‌ టికెట్‌ ఇవ్వబోమంటూ విద్యార్థులను భయపెడుతున్నారు. దీం తో తల్లిదండ్రులు అప్పులకు పరుగులు పెడుతున్నారు.

ఇదా సమయం?

ప్రైవేటు స్కూల్స్‌ విద్యతో వ్యాపారం చేస్తుంటాయి. ఫీజులపైనే నిర్వహణ ఖర్చు, లాభాలు, వ్యాపార విస్తరణ ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ తెలిసినా పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందనే ఆశతో తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతారు. అయితే ఫీజుల బకాయిలు రాబట్టుకోడానికి వార్షిక పరీక్షలు సమయం కాదని, పిల్లలు మానసికంగా ఇబ్బంది పడితే ఆ ప్రభా వం పరీక్షా ఫలితాలపై పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు దగ్గరకు వచ్చే సమయంలో ప్రైవేటు తీరు మరీ దారుణంగా తయార వుతోంది.పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరీ వేధిస్తున్నాయి. కార్పొరేట్‌/ సెంట్రల్‌/హెడ్‌ ఆఫీస్‌ నుంచి టీం వచ్చారు. ఫీజు తక్షణం కట్టకపోతే హాల్‌ టికెట్‌కి రావొద్దంటూ బెదిరిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువులకు ఫోన్లు చేసి అప్పు కోసం అర్థిస్తున్నారు. ఫీజు ఈ రోజు కట్టేస్తు న్నా రా, నేను పరీక్ష రాస్తానా లేదా? అంటూ పిల్లలు కన్నీరు పెడుతుంటే ఆ తల్లిదండ్రుల మనోవేదన వర్ణనాతీతం.గతేడాది ఏప్రిల్‌ 3 నుంచి పది వార్షిక పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేప థ్యంలో పరీక్షలను 15 రోజులు ముందుకు జరిపారు. దీంతో మార్చి 18 నుంచే పరీ క్షలను నిర్వహిస్తున్నారు.

గతంలో పబ్లిక్‌ డొమైన్‌లో

విద్యార్థులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో గతంతో హాల్‌ టికెట్లను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేవారు. అంటే విద్యార్థి నేరుగా హాల్‌ టికెట్‌ని ప్రింట్‌ తీసుకొని పరీక్షలకు హాజరుకావచ్చు. హాల్‌ టికెట్‌పై హెచ్‌ఎం /ప్రిన్సిపాల్‌ సంతకం కేవలం ఐచ్ఛికం (ఆప్షనల్‌) మాత్రమే. దీంతో విద్యార్థులకు ఊరడింపుగా, తల్లిదం డ్రులకు ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ ఏడాది పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టడంపై ఇంకా సమాచారం లేదు. ప్రతి ఏడాదీ హాల్‌టికెట్‌కి ఫీజు బకాయిలకు లంకె పెడు తుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా విద్యా శాఖ అధికారులు ‘ఎందుకనో’ ముందుగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయడం లేదు. పబ్లిక్‌ డొమైన్‌లో హాల్‌ టికెట్లను ఉంచి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ప్రకటన వెలువరిస్తే విద్యార్థులకు చాలా మటుకు తిప్పలు తప్పే అవకాశం ఉంది. పైగా సందట్లో సడేమియా అనే మాదిరిగా ఫీజులను పూర్తిగా నగదు రూపంలో కట్టించుకుంటున్నా, ఆన్‌లైన్‌ విధా నాన్ని పక్కన పెట్టేసినా, కోట్ల రూపాయల్లో నగదు లావాదేవీలు జరుగుతున్నా సంబంధిత శాఖలు కాలు మెదపకుండా బ్లాక్‌ మనీకి తమవంతు పరోక్షంగా సహకరిస్తున్నారనే అపవాదు ఉంది.

జిల్లాలో 137 కేంద్రాల్లో

జిల్లాలోని ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పది పరీక్షలకు 19 మండలాల్లో 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 206 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, 194 ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 29,990 విద్యార్థులకు హాల్‌ టికెట్లు అందాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఎంతమందికి చేరాయో, ఇంకా తీసుకోని వారి ఇబ్బం దులేమిటో అనే అంశాలపై పట్టింపు, పర్యవేక్షణ లేక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో విద్యార్థులు నలిగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమా రు 30 వేల మంది విద్యార్థులుంటే వీరిలో 70 శాతం ప్రైవేటు విద్యార్థులే.తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనే కోరికతో ఫీజులు కట్టలేకపోయినా ప్రైవే టు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఒక్క విద్యార్థి ఏడాదిపాటు చదవాలంటే సుమారు రూ. లక్ష పైనే ఖర్చవుతుంది. దీంతో ఏడాదిలో ఫీజు రూ. లక్ష కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు నలిగిపోతు న్నారు. చివరిలో హాల్‌ టిక్కెట్లకు ముడిపెట్టడంతో తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఫీజు చెల్లించే తల్లిదండ్రులు వేలల్లో ఉన్నా రు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇదే అదు నుగా విద్యార్థులను టెన్‌షన్‌ పెట్టి మరీ ఫీజులు లాగేస్తున్నాయి..

హాల్‌ టికెట్లు ఆపడానికి వీల్లేదు

కె.వాసుదేవరావు, డీఈవో

ఫీజులు బకాయిలు ఉన్నాయంటూ హాల్‌ టికెట్‌ని విద్యార్థికి జారీ చేయకుండా ఆపడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రైవేటు/కార్పొరేటు పాఠశాలలకు ఈ విష యాన్ని స్పష్టంగా చెప్పాం. హాల్‌ టికెట్‌ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థి పరీక్షకు హాజరుకాకపోతే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి వస్తుంది. హాల్‌ టికెట్‌ విషయంలో ఇబ్బందులు ఏర్ప డితే విద్యార్థులు విద్యాశాఖ అధికారులను సంప్రదిం చాలని కోరుతున్నాం. విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. ఏ పాఠశాలలో అయినా ఫీజు కట్టాలని హాల్‌ టిక్కెట్‌ ఇవ్వకపోతే సమాచారం ఇవ్వండి.. వెంటనే చర్యలు తీసుకుంటాం.

Updated Date - Mar 11 , 2024 | 10:17 PM