రైతుల సంక్షేమానికి పాటుపడాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:50 AM
కుమారదేవం పంపింగ్ స్కీమ్ నూతన పాలకవర్గ సభ్యులు రైతులు సంక్షేమానికి పాటుపడాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు మండలం కుమారదేవం పంపింగ్ స్కీమ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం గురువారం నిర్వహించారు. పంపింగ్ స్కీమ్ అధ్యక్షుడిగా గొరిజాల సురేష్, ఉపాధ్యక్షులుగా యనమదల శివరామకృష్ణ ప్రసాద్, కార్యదర్శిగా జీవీవీ సత్యనారాయణ ప్రసాద్, మరో ఎని మిది మంది సభ్యులుగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యే ముప్పిడి
కుమారదేవం పంపింగ్ స్కీమ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
కొవ్వూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కుమారదేవం పంపింగ్ స్కీమ్ నూతన పాలకవర్గ సభ్యులు రైతులు సంక్షేమానికి పాటుపడాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు మండలం కుమారదేవం పంపింగ్ స్కీమ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం గురువారం నిర్వహించారు. పంపింగ్ స్కీమ్ అధ్యక్షుడిగా గొరిజాల సురేష్, ఉపాధ్యక్షులుగా యనమదల శివరామకృష్ణ ప్రసాద్, కార్యదర్శిగా జీవీవీ సత్యనారాయణ ప్రసాద్, మరో ఎని మిది మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రైతులు పంటలు పండిస్తేనే ప్రతిఒక్కరికి అన్నం దొరుకుతుందని, టీడీపీ ఆవి ర్భావం నుంచి రైతు సంక్షేమానికి పాటు పడుతోందన్నారు. కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఎంపీపీ కాకర్ల నారాయుడు, సూరపనేని చిన్ని, వట్టికూటి వెంకటేశ్వరరావు, సూర్యదేవర రంజిత్ పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
చాగల్లు, డిశంబరు 26, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్త్ అసిస్టెంట్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘ నాయకులు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కోరారు. ఈ మేరకు బ్రాహ్మణగూడెంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నా మని, ముగ్గురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి వీధిన పడిన హెల్త్ అసిస్టెంట్‌లను ప్రభుత్వం ఆదుకోవాలని సంఘ నాయకులు రాజశేఖర్, డీవీ రామకృష్ణ కోరారు.