Share News

నకిలీ నోట్లతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:20 AM

నకిలీ నోట్లతో ఒకరిని మోసం చేసిన వ్యక్తులను అన్నవరం పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పిఠాపురానికి చెందిన అనుసూరి రాజబాబు వద్ద ఒక స్థలం అమ్ముతానని అదే గ్రామానికి చెందిన ఈటి జగదీష్‌ రూ.20 లక్షలు తీసుకున్నాడు.

నకిలీ నోట్లతో మోసం చేసిన వ్యక్తి అరెస్టు

అన్నవరం, ఫిబ్రవరి 16: నకిలీ నోట్లతో ఒకరిని మోసం చేసిన వ్యక్తులను అన్నవరం పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పిఠాపురానికి చెందిన అనుసూరి రాజబాబు వద్ద ఒక స్థలం అమ్ముతానని అదే గ్రామానికి చెందిన ఈటి జగదీష్‌ రూ.20 లక్షలు తీసుకున్నాడు. అయితే స్థలం విక్రయించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తుండడంతో తీవ్ర ఒత్తిడి చేశారు. అయితే తన వద్ద డబ్బులు లేవని బ్లాక్‌మనీ ఉందని దానిపై కెమికల్స్‌ పూస్తే అసలైన నోట్లగా మారతాయని పేర్కొంటూ కొన్ని అసలు నోట్లపై నలుపు రంగు పూసి తర్వాత కెమికల్‌తో కడగడంతో అవి అసలు కరెన్సీగా కనిపించడంతో నమ్మి 5 నోట్లకట్టలు తీసుకున్నారు. తర్వాత మోసపోయినట్లు గ్రహించిన రాజబాబు మిగిలిన మొత్తంపై మరోసారి ఒత్తిడి చేయడంతో శుక్రవారం అన్నవరం వస్తే మిగిలిన నోట్లకట్టలు ఇస్తానని జగదీష్‌ తెలిపారు. దీంతో రాజబాబు పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశాలతో ప్రత్తిపాడు ఇన్‌చార్జి సీఐ ఎస్‌.లక్ష్మణరావు, అన్నవరం ఎస్‌ఐ కిశోర్‌ సిబ్బందితో జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల సమీపంలో వలపన్ని జగదీష్‌తో పాటు మరో ముగ్గురిని రెడ్‌ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 నోట్ల కట్టలు, కెమికల్‌ బాటిల్స్‌, వారు వచ్చిన ఆటోను స్వాధీనం చేసుకుని ప్రత్తిపాడు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచామని ఎస్‌ఐ కిశోర్‌ తెలిపారు.

Updated Date - Feb 17 , 2024 | 12:20 AM