Share News

అమ్మో రూ.200

ABN , Publish Date - May 17 , 2024 | 12:34 AM

జిల్లాలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది.. రూ.100, 200,500 నోట్లు నకిలీ మకిలీ అంటించుకున్నాయి. దీంతో దుకాణాల వద్ద ఏ నోటు ఇచ్చినా అయ్యబాబోయ్‌ అంటున్నారు..

అమ్మో రూ.200
నకిలీ రూ.200 నోటు

అనపర్తి, మే 16 : జిల్లాలో నకిలీ నోట్ల చలామణి పెరిగింది.. రూ.100, 200,500 నోట్లు నకిలీ మకిలీ అంటించుకున్నాయి. దీంతో దుకాణాల వద్ద ఏ నోటు ఇచ్చినా అయ్యబాబోయ్‌ అంటున్నారు.. ఒకసారి చూసి తీసుకుంటు న్నారు. నకిలీ నోటు పట్ల అవగాహన ఉన్న వారు పరవాలేదు.. లేని చిరు వ్యాపారులు మాత్రం భారీగా మోసపోతున్నారు. అనపర్తిలో నకిలీ నోట్ల చలామణీ ఇటీవల ఊపందుకుంది. గతంలో రూ.500,రూ.1000 నకిలీ నోట్ల చలామణి అధికంగా జరిగేది. అయితే పెద్ద నోట్ల రద్దు తరువాత నకిలీ నోట్ల చలామణీ గణనీయంగా తగ్గింది. గతంలో కొత్త రూ.500 నకిలీ నోట్లు వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీ రూ.200 నోట్లు చలామణిలోకి రావడంతో ఇటు ప్రజలు అటు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. అనపర్తిలో అయితే రూ.200నోటు చూడగానే అమ్మో రూ.200 నోటా అంటూ పరిశీలించి మరీ తీసుకుంటున్నారు. ఈ నోట్ల చలామణితో అనేక మంది పేదలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అనపర్తి పరిసరాల్లో నోట్ల తయారీ కేంద్ర ఉండి ఉండవచ్చనే అనుమా నాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.ఎటువంటి అనుమానం రాకుండా అసలు నోట్లకు దీటుగా రూ.200 నోటు ఉండటంతో పరీక్షగా చూస్తే తప్ప తేడాను కనిపెట్టలేకపోతున్నారు.చిన్న నోటు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదనే కో ణంలో రూ.200 నోట్లు చలామణిలోకి తెచ్చి ఉంటారని సమాచారం.నోట్ల చలామణీ పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడకుండా పోలీస్‌ యం త్రాం గం నకిలీ నోట్ల తయారీపై దృష్టి సారించాలని వ్యాపారులు కోరుతున్నారు.

Updated Date - May 17 , 2024 | 12:34 AM