Share News

ఈవీఎంలకు మూడంచెల భద్రత

ABN , Publish Date - May 17 , 2024 | 12:36 AM

ఆదికవి నన్నయ వర్శిటీలోని స్ర్టాంగ్‌ రూమ్‌ వద్ద 24/7 మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత తెలిపారు.

ఈవీఎంలకు మూడంచెల భద్రత
భద్రత ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ

ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

రాజానగరం, మే 16 : ఆదికవి నన్నయ వర్శిటీలోని స్ర్టాంగ్‌ రూమ్‌ వద్ద 24/7 మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. కేంద్ర బలగాలు పహరా కాస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి డా.కె.మాధవీలత తెలిపారు. ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి గురువారం సాయంత్రం ఆమె ఇక్కడ ఏర్పాట్లు పరిశీ లించారు.ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు నన్నయ వర్శిటీలో భద్రపరచిన సంగతి విధితమే. ఈ మేరకు భద్రత ఏర్పా జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. కేంద్ర ఆర్మ్‌డ్‌, పోలీసు ఫోర్స్‌, మొబైల్‌ టీమ్‌ ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమేరా పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఏడు అసెంబ్లీ, రాజమహేంద్ర వరం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్‌, కంట్రోలు యూనిట్స్‌, వీవీ ప్యాట్స్‌ పకడ్బందీగా భద్రపరిచామన్నారు. కౌంటిం గ్‌కు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద మూడు షిఫ్ట్‌లలో బందోబస్తు, గెజిటెడ్‌ అధికారుల పర్యవేక్షణ ఉందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టా మన్నారు.స్ర్టాంగ్‌ రూమ్‌లలో ఎటువంటి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగ కుండా ఉండడంకోసం విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఆదేశించారు. ఎస్పీ పి.జగదీష్‌ మాట్లాడుతూ నన్నయ వర్శిటీ వద్ద డీఎస్పీ, సీఐ, మొబైల్‌ టీమ్‌, సీఆర్పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు, రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.కౌంటింగ్‌ ముగిసే వరకూ 144 సెక్షన్‌ అమ లులో ఉంటుందన్నారు.సమావేశంలో రిటర్నింగ్‌ అధికారులు ఎన్‌.తేజ్‌భ రత్‌, కె.దినేష్‌కుమార్‌,అశుతోష్‌మిశ్రా,ఎ.చైత్రవర్షిణి, ఎం.మాధురి,రమణ నాయక్‌,కె ఎల్‌ శివజ్యోతి, అదనపు ఎస్పీలు ఎల్‌.చెంచిరెడ్డి, కృష్ణనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:36 AM