ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి రూ.10 వేలు మంజూరు
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:28 AM
పోషణ్ వాటికాస్ కాంపోనెంట్ కింద ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి రూ.10వేల చొ ప్పున నిధులు విడుదల చేస్తా మని కలెక్టర్ ప్రశాంతి అన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీలో కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 18: పోషణ్ వాటికాస్ కాంపోనెంట్ కింద ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి రూ.10వేల చొ ప్పున నిధులు విడుదల చేస్తా మని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం బాలాజీపే ట, సిగిడిలపేటల్లోని నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను శనివా రం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ పోషణ్ వాటికాస్ కాంపోనెంట్‌ను ప్రతి అం గన్‌వాడీ కేంద్రంలోని సెక్టార్ సూపర్‌వైజర్ పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహించాలనిఆదేశిం చారు. అందులో భాగంగా 8 రకాల ఆకుకూరలు, అశ్రురకాల కూరగాయలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పెంచాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కేంద్రం ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌కు రూ.10వేల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వాటిని అంగన్‌వాడీ వర్కర్ ఏర్పాటు చేసి పరిరక్షించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో స్థలం లేనిచోట్ల కూరగాయలు పచ్చి ఆకుకూర లు పెంచడానికి కంటైనర్ గార్డెనింగ్, కుండ తో ట ఏర్పాటు చేయాలన్నారు. యూనిట్ ఖర్చు రూ.10వేలతో ఆయిల్ కూరలు, ఔషధ మొక్కలు, పండ్లచెట్లు పెంచాల్సి ఉంటుందన్నారు. నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ హాజరు 100శాతం ఉండాలన్నారు. పిల్లల్లో రక్తహీనత, అనీమియా వంటి వాటి పరిష్కారానికి పోషణ్ వాటికాస్ కాంపోనెంట్‌ను ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో అమలు చేయాలన్నారు.