Share News

ఈసారి మిర్చిసాగు కష్టమే!

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:59 PM

విలీన మండలాల్లో ఈ ఏడాది మిర్చి సాగు బహుకష్టంగా కన్పిస్తోంది. గత మూడేళ్లుగా అన్నదా తలను అతలాకుతలం చేసి, అప్పుల ఊబి లోకి నెట్టేసిన నల్లితామర పురుగు భయంతో మిర్చి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదు.

ఈసారి మిర్చిసాగు కష్టమే!

మూడేళ్లుగా పంటకు ఆశిస్తున్న నల్లితామర పురుగు

ఏజెన్సీలో తగ్గుతున్న మిర్చి సాగు విస్తీర్ణం

వరుస నష్టాలతో రైతులు విలవిల

మొక్కజొన్న, లంకపోగాకు, పత్తిసాగుపై రైతుల ఆసక్తి

ఎటపాక, జూన్‌ 9: విలీన మండలాల్లో ఈ ఏడాది మిర్చి సాగు బహుకష్టంగా కన్పిస్తోంది. గత మూడేళ్లుగా అన్నదా తలను అతలాకుతలం చేసి, అప్పుల ఊబి లోకి నెట్టేసిన నల్లితామర పురుగు భయంతో మిర్చి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. మిర్చి సాగు బదులు ప్రత్యా మ్నాయ పంటలు సాగు చేస్తేనే కొంతమేర నష్టాల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు. దీంతో ఈఏడాది మిర్చిసాగు కష్టంగా కనబడ డంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపఽథ్యంలో మిర్చి సాగు బదులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, లంకపొగాకు, పత్తి, మినుము పంటలను సాగు చేసేందుకు సిద్ధ మవుతు న్నారు. దాంతో ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న, లంకపొగాకు, మినుముల సాగు పెరిగే అవకాశ ముంది. మిర్చి రైతులు వరస నష్టాలతోపాటు, నల్లితా మర పురుగు భయంతో గతంలో పది ఎకరాలు మిర్చి సాగు చేసిన రైతులు కేవలం ఒకటి నుంచి 3 ఎకరాల వరకు మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతు న్నారు. అంతకంటే ఎక్కువ సాగు చేస్తే నల్లితామర పురుగు సోకి మళ్లీ నష్టపోవాల్సి వస్తుందనే భయంతో సాగుకు ముందడుగు వేయడంలేదు. సన్న,చిన్న, కౌలు రైతులు అయితే అసలు మిర్చి పంట సాగువైపు ఆసక్తి చూపడంలేదు. దాంతో విలీన మండలాల్లో ఈ ఏడాది మిర్చిసాగు గణనీయంగా తగ్గనుందని హర్టికల్చర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటపాక మండ లంలో 2021 ఏడాదిలో మిర్చి 2,950 ఎకరాల్లో సాగు చేయగా, 2022 ఏడాదిలో 2,450 ఎకరాల్లో, 2023 ఏడాదిలో 1,850 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. అయితే మాత్రం ఇంకా గణనీయంగా తగ్గే అవకాశముందని తెలుస్తోంది. ఇదేకాక ఈ ఏడాది విలీన మండలాల అన్నదాతలను గోదావరి వరద భయం కూడా వెంటాడుతోంది. గతేడాది గోదావరి వరద ప్రభావం లేకపోవడంతో పంటలు పెద్దగా దెబ్బతినలేదు. ఈఏడాది గోదావరి వరదల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళనలో ఉన్నారు.

మిర్చిసాగుతో రూ. 10లక్షలు నష్టపోయా

వల్లభనేని కిషోర్‌, రైతు, గన్నవరం గ్రామం

గత మూడేళ్ల నుంచి మిర్చిపంట సాగు కలిసిరావ డంలేదు. నల్లితామర పురుగు ఆశించడంతో వరుస నష్టాలు చవిచూ స్తున్నాం. గతేడాది పది ఎకరాలు మిర్చిపంట సాగుచేసి, రూ.10 లక్షలవరకు నష్టపోయా. ఈ ఏడాది కేవలం మూడు ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు చేద్దామని నిర్ణయించుకున్నాను. ప్రత్యా మ్నాయంగా ఎనిమిది ఎకరాల్లో అపరాల(మినుము) పంట సాగు చేయనున్నానని రైతు కిషోర్‌ మాట్లాడారు.

ఐదు ఎకరాల్లో పత్తి పంటసాగు

పర్శిక వీర్రాజు, గిరిజన రైతు, కృష్ణవరం గ్రామం

గతేడాది 4 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రూ.4లక్షల వరకు నష్టం వాటిల్లింది. బయట అప్పులు చేసి, మరీ పంటసాగు చేశాను. అప్పులు ఇంకా తీరలేదు. ఈఏడాది మిర్చిపంట బదులు 5 ఎకరాల్లో పత్తిపంట సాగు చేస్తాను. గోదావరి వరద భయం ఉన్నప్పటికీ పత్తిపంటే సాగు చేస్తానని రైతు వీర్రాజు అన్నారు.

అన్నవరం పంపా అధికారిణి శ్రీదేవి తదితరులు పాల్గొ

Updated Date - Jun 09 , 2024 | 11:59 PM