పర్యావరణ సమతుల్యత పెంపునకు చర్యలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:26 PM
పర్యావరణ సమతుల్యత, సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకే వివిధ రకాల ప్లాంటేషన్ పనులు గుర్తించాలని డ్వామా పీడీ పి.జగదాంబ అన్నారు.

కొవ్వూరు, జనవరి 12: పర్యావరణ సమతుల్యత, సన్న, చిన్నకారు రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకే వివిధ రకాల ప్లాంటేషన్ పనులు గుర్తించాలని డ్వామా పీడీ పి.జగదాంబ అన్నారు. కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం డివిజన్‌లోని ఉపాధి హమీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేబర్ బడ్జెట్ ప్రకారం పనులు గుర్తించి, పరిపాలన ఆమోదం పొందాలన్నారు. సీఎల్‌ఏఆర్‌టీ యాప్ ద్వారా కొత్త పనులు గుర్తించుట, భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టవలసిన పనులపై అవగాహన కల్పించడంపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.సుశీల, కొవ్వూరు క్లస్టర్‌కు సంబంధించి 9 మండలాల కార్యాలయాల సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది, టీఏలు, సీవోలు పాల్గొన్నారు.