Share News

ముగిసిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు

ABN , Publish Date - May 24 , 2024 | 12:26 AM

ఏపీఈఏపీసెట్‌-2024 ఆన్‌లైన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్షలు గురువారం ఉదయం సెషన్‌తో ప్రశాంతంగా ముగిసినట్లు సెట్‌ చైర్మన్‌, వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడ జిల్లాలోని 5పరీక్షా కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 930 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 895 మంది హాజరయ్యారని 35 మంది గైర్హాజరు కాగా మొత్తం 96.24 శాతం హాజరు నమోదైందన్నారు.

ముగిసిన ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు

జేఎన్టీయూకే, మే 23: ఏపీఈఏపీసెట్‌-2024 ఆన్‌లైన్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్షలు గురువారం ఉదయం సెషన్‌తో ప్రశాంతంగా ముగిసినట్లు సెట్‌ చైర్మన్‌, వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడ జిల్లాలోని 5పరీక్షా కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన పరీక్షకు 930 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 895 మంది హాజరయ్యారని 35 మంది గైర్హాజరు కాగా మొత్తం 96.24 శాతం హాజరు నమోదైందన్నారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పరీక్షా కేంద్రంలో 697 మంది, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఒక పరీక్షా కేంద్రంలో 340 మంది హాజరయ్యారన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీకి సంబంధించిన పరీక్ష ప్రాఽథమిక కీ ని వీసీ విడుదల చేశారు. రెస్పాన్స్‌ షీట్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ప్రాథమిక కీ పై విద్యార్థులకు అభ్యంతరాలుంటే తెలియచేయవచ్చన్నారు. అదే విధంగా ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షల ప్రాఽథమిక కీ ని శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ప్రాఽథమిక కీ పై విద్యార్థులకు అభ్యంతరాలుంటే తెలియచేయవచ్చని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.వెంకటరెడ్డి తెలిపారు. అంతే కాకుండా ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి 25 శాతం వెయిటేజీ మార్కులను ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా తీసుకోనున్న నేపఽథ్యంలో ఏపీ రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్థులు కాకుండా ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు తమ మార్కులను ఏపీఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని వాటి ద్వారా వారికి ర్యాంకులు కేటాయించనున్నట్లు కన్వీనర్‌ సూచించారు. విద్యార్థులకు ఎటువంటి సందేహాలున్నా 0884 2359599, 2342499 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:26 AM