మాస్టర్ ప్లాన్ ప్రకారం వెంకన్న ఆలయాభివృద్ధి
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:05 AM
ఆత్రేయపురం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిందని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాభివృద్ధి, భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టిసారించిందని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనరు ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. తొలుత అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనస్వాగతం

వాడపల్లిలో రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ సందర్శన
ఆత్రేయపురం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిందని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాభివృద్ధి, భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టిసారించిందని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనరు ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. తొలుత అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచ నం అందుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వాడపల్లి వెంక న్న క్షేత్రం గత 12 ఏళ్ల నుంచి దినదినాభివృద్ధి చెం దుతుందని తద్వారా భక్తుల సంఖ్య అధికంగా ఉన్న దృ ష్ట్యా వసతి సౌకర్యాలు ఈ క్షేత్రంలో లేకపోవడంతో మాస్టర్ ప్లాన్ ప్రకా రం భక్తులకు మెరుగైన సౌకర్యాలు, వసతి, సకాలంలో దర్శనం అంది ంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ అన్నదానం, భక్తులకు పులిహర, ప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. దివ్యాంగులు, వృద్ధు లు, చిన్నపిల్లలకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. కంపార్ట్‌మెంట్లు, క్యూకాంప్లెక్స్‌లు స్లాట్ విధానం అమలు చేసి భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం అందించేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరారవు క్షేత్రంలో చేపడుతున్న అభి వృద్ధి కార్యక్రమాలను కమిషనర్‌కు వివరించారు.
భక్తుల ఆగ్రహం
శనిత్రయోదశి పర్వదినం కావడంతో వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రము ఖుల తాకిడి అధికంగా ఉండటంతో భక్తులు గం టల తరబడి క్యూలలో నిలబడి ఉండిపోయారు. రూ.200 దర్శనం టికెట్టు పొందిన భక్తులు సు మారు 5గంటలు క్యూలలో నిరీక్షించారు. వీఐపీల సిఫార్సులేఖలతో వచ్చిన భక్తులకు దర్శనాలు సు లభంగా అవ్వడంతో క్యూలలో వేచి ఉన్న భక్తు లు ఆలయ అధికారులపై మండిపడ్డారు. దేవదా య కమిషనర్ సత్యనారాయణ వద్ద ఆవేదన వ్య క్తం చేశారు. కమిషనరు భక్తులతో మాట్లాడి వృ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు త్వరగా దర్శనమయ్యేలా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాలు, బిస్కెట్లు క్యూలైన్లలో వారికి అందించాలన్నారు. ప్రతీ శనివారం దర్శనాలకు ఆలస్యం కావడంతో లఘుదర్శనం మాత్రమే నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.