బదిలీలకు ఓకే!
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:46 PM
ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీ సందడి నెలకొంది. ఈ నెల 19వ తేదీ నుంచి సందడి మొదలైంది.ఈ నెల 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియపూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. చాలా కాలం తర్వాత సాధారణ బదిలీలు జరు గుతున్నాయి. జిల్లాలో అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తు న్నారు.
తొలుత ఉన్నతాధికారుల బదిలీ
ఇప్పుడు మిగతా ఉద్యోగుల వంతు
19 నుంచి మొదలైన సందడి
అన్ని డిపార్ట్‌మెంట్లకు అవకాశం
27 వరకూ దరఖాస్తుల స్వీకరణ
సచివాలయ ఉద్యోగులకు ఛాన్స్
ఎమ్మెల్యేల సిఫారసులకు క్యూ
31వ తేదీన పోస్టింగ్‌లు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీ సందడి నెలకొంది. ఈ నెల 19వ తేదీ నుంచి సందడి మొదలైంది.ఈ నెల 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియపూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. చాలా కాలం తర్వాత సాధారణ బదిలీలు జరు గుతున్నాయి. జిల్లాలో అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తు న్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట కలెక్టర్, ఎస్పీ, జేసీ వంటి ప్రధాన బదిలీలు జరిగిన సంగతి తెలి సిందే. డీఎస్పీలు, ఆర్డీలు, సీఐలు, తహశీల్దార్ల బదిలీలు ఇప్పటికే చాలా వరకూ పూర్తయ్యాయి. ప్రస్తుతం వివిఽధ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగి వరకూ బదిలీ జరగనుంది. కేవలం జైళ్ల శాఖకు మాత్రం బదిలీలు లేవు. ఇక జిల్లాలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, ముని సిపల్ అడ్మినిస్ర్టేషన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో గులు, సివిల్ సఫ్లయిస్, మైనింగ్ అండ్ జియాలజీ, అన్ని విభాగాలకు చెందిన ఇంజనీరింగ్ స్టాఫ్, ఎండోమెంట్, ట్రాన్స్‌పోర్ట్ ,ఈఫ్‌అండ్‌టీ, ఇండస్ర్టీస్, ఎనర్జీ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్, కమర్షియల్ టాక్సెస్, ఎక్సయిజ్ శాఖల్లో బది లీలు జరగనున్నారు.ఈ మేరకు చాలా విభాగాల ఉద్యోగులు ఎమ్మెల్యేల సిఫార్స్ లేఖలు తీసుకుంటున్నారు.ఎవరికి వారు ఇష్టమైన చోట పోస్టు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి దారులు వారు వెతుకుంటున్నారు. ఎమ్మెల్యేలు లెటర్లు ఇవ్వ కపోతే ఇతర మార్గాలపై దృష్టిపెడుతున్నారు.
27వ తేదీ వరకూ అవకాశం..
ఈ నెల 27వ తేదీ లోపు అన్ని డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఉండాలి. 31వ తేదీలోపు వారికి పోస్టింగ్‌లు ఇస్తారు. ఇంజనీరింగ్ విభాగంలో చాలా మంది ఇంజనీర్లు బదిలీ కానున్నారు. ఐదేళ్లు దాటిన వారం తా బదిలీ అవుతారు. మునిసిపాలిటీలో మాత్రం ఎక్కడి వారు అక్కడే ఉండిపోయేలా ప్రయత్నిస్తున్నారు. చిన్న స్థాయి నుంచి మంత్రుల వరకూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎవరు అందుబాటులో ఉంటే వారితో సిఫార్స్ చేయించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా డబ్బు ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే.
సచివాలయ ఉద్యోగులకు ఇలా..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఐదేళ్లు నిండితేనే బదిలీ. రిక్వెస్ట్ బదిలీలు ఉన్నాయి.కానీ ఇవన్మీ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే జరుగుతున్నాయి.సచివాలయాలకు సం బంధించి పంచాయతీరాజ్ రూరల్ డెవలమెంట్,అందు లో ని ఇంజనీరింగ్ విభాగం,యానిమల్ హజ్బెండరీ, ఫిషరీష్, హోంలకు చెందిన ఉద్యోగులను ఉమ్మడి జిల్లా కలెక్టర్ బది లీ చేస్తారు.మెడికల్ అండ్ హెల్త్‌కు సంబం ధించి డీఎం హెచ్‌వో బదిలీ చేస్తారు. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లు ఉన్నట్టు చెబుతున్నారు.అంతరజిల్లాల బదిలీల విష యంలో ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం లేదు. మాన్యు వల్ గా ఆయా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలిస్తారు. ఈ విధంగా ప్రస్తుతం జిల్లాలో బదిలీ సందడి నెలకొంది.
============================================