ఉద్యోగులకు ఎన్నికల విధులు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:59 AM
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటాను ప్రభుత్వ పోలింగ్ పర్శనల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(పీపీఎంఎస్)లో తప్పని సరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.మాధవీ లత తెలిపారు.
ఎవరికీ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లేదు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి) : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటాను ప్రభుత్వ పోలింగ్ పర్శనల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(పీపీఎంఎస్)లో తప్పని సరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.మాధవీ లత తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని అన్ని శాఖల డ్రాయింగ్ అండ్ డిస్పర్శ్‌మెంట్ (డీడీవో) అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్‌భరత్‌తో కలిసి ఆమె సమీక్షించారు. కొత్త జిల్లా పరిధిలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ కోసం ప్రిసైడింగ్,పోలింగ్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి డీడీవో వారి పరిధిలోని ఆయా క్యాడర్‌లో పనిచేసే ఉద్యోగుల వివరాలు పీపీఎంస్ సాఫ్ట్‌వేర్‌లో క్రోడీకరించి ధ్రువీకరించాలన్నారు. ప్రతి అధికారి అందించిన సమాచారాన్ని ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు పీపీఎంఎస్‌లో అప్‌డేట్ చేసిన తర్వాత ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎన్నికల విధుల కేటాయింపు ఉంటుందన్నారు.మహిళా ఉద్యో గులకు వారు పని చేసే ప్రాంతానికి అనుగుణంగా కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకుం టామని చెప్పారు.జిల్లాలో సుమారు 10 వేల మంది డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్నారు.ఓటరు గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేయాలని చె ప్పారు.కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి 15 మంది టేడా ఎంటీ ఆపరేటర్లతో ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. ట్రెజరీ శాఖ సీఎఫ్‌ఎం ఎస్ డేటాకి అనుగణంగా ఎన్నికల విధులు నిర్వర్తిం చేవారిని గుర్తిస్తామని తెలిపారు. అధికారులకు రోజువారి డేటా ఎంట్రీ కోసం ఏ స్లాట్ ఇచ్చామో తెలియజేస్తామన్నారు.కలెక్టరేట్‌లో ఏపీఎన్జీవో రాజమహేంద్రవరం నగరశాఖ ప్రచురించిన ఉద్యోగుల కాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.నరసిం హులు, కెఆర్‌ఆర్‌సీ ఎస్‌డీటీ కృష్ణనాయక్, సీపీవోఎల్ అప్పలకొండ, మాస్టర్ ట్రైనర్ ఎన్‌ఐసీ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు.
ఎన్‌ఎంఆర్‌ల వేతనాలపై నిర్ణయం
రాజమహేద్రవరం, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఎంఆర్ రోజువారీ వేతనాలను నిర్ణయిస్తూ కలెక్టర్ మాధవీలత ఆదేశాలిచ్చారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్ కార్మికులకు నైపుణ్యం కలిగిన వారికి రోజుకు రూ.827, సెమీ స్కిల్డ్ రూ.687, నైపుణ్యం లేనివారికి రూ.560 చొప్పున చెల్లించాలన్నారు. ఈ వేతనాలు 1.4.2023 నుంచి 31.3.2024 వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. కార్యక్ర మంలో సహాయ కార్మిక కమిషనర్ బీఎస్‌ఎం వలీ, పీఆర్ ఎస్‌ఈ మహ్మద్ ఆలిముల్హా, ఇరిగేషన్ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.