Share News

విద్యుత్‌ చార్జీల భారం పాపం జగన్‌దే’

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:11 AM

వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీలను ఎన్నిసార్లు పెంచారో మరిచిపోయారా అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు.

విద్యుత్‌ చార్జీల భారం పాపం జగన్‌దే’

అమలాపురంటౌన్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీలను ఎన్నిసార్లు పెంచారో మరిచిపోయారా అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగానే విద్యుత్‌ చార్జీలను పెంచాల్సి వచ్చిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించినా వైసీపీ నాయకులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్‌ అందించిన రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు భారంగా మిగిల్చారని విమర్శించారు. అమలాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను సీఎం చంద్రబాబు తిరిగి గాడిన పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తుంటే జగన్‌రెడ్డి విషం కక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:11 AM