Share News

నేడు మోగనున్న నగారా

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:23 AM

ఎన్నికల మూడ్‌లోకి పూర్తిగా వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేస్తోంది.కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది.

నేడు మోగనున్న నగారా

3 గంటల నుంచి కోడ్‌ అమలు

ప్రలోభాలకు తెరలేపిన వైసీపీ

ఆవ భూముల పట్టాలు పంపిణీ

(రాజమహేంద్రవరం - ఆంద్రజ్యోతి)

ఎన్నికల మూడ్‌లోకి పూర్తిగా వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేస్తోంది.కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది. షెడ్యూల్‌ జారీ అయినప్పటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుం ది. ఇక ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉండవు.. రాజకీయ నాయకుల పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు అన్ని తొలగించాల్సి ఉంటుంది. కొత్త పథకాలు ప్రారంభం కాని, అభివృద్ధి పనుల ప్రారం భం కాని ఉండవు. షెడ్యూల్‌ ప్రకటన తరువాత నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. షెడ్యూల్‌ ప్రకటన రానుండడంతో జిల్లా రాజకీయ పార్టీల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే టీడీపీ, జనసేన అసెంబ్లీ అభ్యర్థుల అందరూ ఖరారైన సంగతి తెలిసిందే. వైసీపీ మొ త్తం అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను శనివారం అధికారికంగా ప్రకటించనుంది.ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం లోక్‌సభ ఉమ్మడి అభ్యర్థి ప్రకటన రేపో మాపో రానున్నది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్ప డిన తరువాత లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు తెలిసిందే. శనివారం సాయంత్రానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఖరారైన అభ్యర్థులతో పాటు టిక్కెట్లను ఆశించేవారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రచారం ఆరంభించారు. తమ మేనిఫెస్టోలోని అంశాలను ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.

స్థలం చూపకుండానే.. ఇళ్ల పట్టాలు..

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే లోపు ఉన్న ప్రతి క్షణాన్ని ప్రలోభా లకు వినియోగించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వైసీపీ అభ్య ర్థులు చీరలు, రకరకాల వస్తువులతో ప్రలోభాలకు తెరలేపారు. నేటి మధ్యా హ్నం 3 గంటల వరకూ అవకాశం ఉండడంతో మరింత రెచ్చిపోతారు. రాజమహేంద్రవరం అర్భన్‌ పరిధిలో సుమారు నాలుగేళ్ల కిందట ఆవ భూ ముల్లో ఇళ్లపట్టాలు ఇవ్వడానికి హామీపత్రాలు ఇచ్చిన లబ్ధిదారులకు 2 రోజుల నుంచి హడావుడిగా పట్టాలు పంపిణీ చేస్తున్నారు. కొంత మంది లబ్ధిదారులకు అసలు భూములు చూపించకుండా, మరికొందరికి అసలు భూమి లేకుండానే పట్టాలు ఇచ్చేయడం గమనార్హం. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే తతంగం నడుస్తుంది. సచివాలయాల ఉద్యోగుల ద్వారా పట్టాలు పంపిణీ చేయడం విశేషం. తమకు భూములు ఎక్కడ ఇస్తున్నారని అడిగితే ముందు పట్టాలు తీసుకోండి వారం రోజుల్లో భూములు చూపిస్తామంటున్నారు. ఏదో విధంగా మభ్యపెట్టి ఓటు పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే చీరలు, గిప్టులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 16 , 2024 | 12:23 AM