రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లోకి ’జీఎస్’
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:42 AM
ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలు, మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.

అమలాపురం రూరల్, జూన్ 11: ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలు, మండల పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. వీటికి ఆధునిక విధానాలను, ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కామనగరువు పంచాయతీ కార్యదర్శి జీఎస్ నారాయణరావును ఫారిన్ సర్వీసెస్ కింద విధుల్లోకి తీసుకుంటూ కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. ఆయన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆయన కామనగరువులో కార్యదర్శిగా రిలీవ్ అయి మంగళవారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏఎస్‌వోగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.