Share News

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:37 AM

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించవ ద్దని, జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని ఎస్‌ఈబీ విజయవాడ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శంకరయ్య అన్నారు. దేవరపల్లి, నిడదవోలులో ఎస్‌ఈబీ స్టేషన్‌న్లను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ అమ లులో ఉన్నందున అధికారులు అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు
నిడదవోలులో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్‌ఈబీ డీసీ శంకరయ్య

  • దేవరపల్లి, నిడదవోలు స్టేషన్లు తనిఖీ

దేవరపల్లి/నిడదవోలు ఏప్రిల్‌ 27: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించవ ద్దని, జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని ఎస్‌ఈబీ విజయవాడ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శంకరయ్య అన్నారు. దేవరపల్లి, నిడదవోలులో ఎస్‌ఈబీ స్టేషన్‌న్లను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ అమ లులో ఉన్నందున అధికారులు అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. అక్రమ మద్యం, సారా పై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని సారా తయారీ, అమ్మకం, బెల్టుషాపుల అమ్మ కాలు నిరోధించే విధంగా పనిచేయాలన్నారు. అనంతరం స్టేషన్లలో కేసులు నమోదు చేసిన ఫైల్‌ను, సీజ్‌ చేసిన మద్యంసీసాలు, వాహనాల వివరాలతోపాటు పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వెంట సీఐ స్వామి, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.వీరబ్రహ్మం, ఎస్‌ఐలు సుధీర్‌, దొరబాబు, సిబ్బంది ఉన్నారు.

  • ఎస్‌ఈబీ దాడుల్లో ఇద్దరి అరెస్టు

దేవరపల్లి ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలోని గోపాలపురం మండలం నందిగూడెంలో 30లీటర్ల సారాను, బుచ్చయ్యపాలెంలో 30లీటర్ల సారాను మోటార్‌సైకిల్‌పై తరలిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు సీఐ స్వామి తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 12:37 AM