Share News

ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:40 AM

జూన్‌ 4న జరిగే ఎన్నికల కౌం టింగ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రజలు నడుచుకోవాలని అంగర ఎస్‌ఐ ఎ.పరదేశి అన్నారు. సోమవారం ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ పర్యవేక్షణలో మండపేట రూరల్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోవాలి

కపిలేశ్వరపురం, జూన్‌3: జూన్‌ 4న జరిగే ఎన్నికల కౌం టింగ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రజలు నడుచుకోవాలని అంగర ఎస్‌ఐ ఎ.పరదేశి అన్నారు. సోమవారం ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ బి.రామకృష్ణ పర్యవేక్షణలో మండపేట రూరల్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్‌ఐ తెలిపారు. కౌంటింగ్‌ అనంతరం ర్యాలీలు, సమావేశాలు, బాణసంచా కాల్చడం, డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Jun 04 , 2024 | 12:40 AM