Share News

కౌంటింగ్‌ నేపథ్యంలో దారిమళ్లింపు

ABN , Publish Date - Jun 04 , 2024 | 01:07 AM

కాకినాడ క్రైం, జూన్‌ 3: కాకినాడ జిల్లా పార్లమెంట్‌, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం కాకినాడ జేఎన్‌టీయూ క్యాంపస్‌, జేఎన్‌టీయూ స్టేడియం ప్రాంగణాల్లో జరగనున్న నేపఽథ్యంలో కాకినాడకు రాకపోకలు సాగించే వాహనాల ట్రాఫిక్‌ మళ్లింపునకు ప్రతి

కౌంటింగ్‌ నేపథ్యంలో దారిమళ్లింపు
జేఎన్‌టీయూ వైపు వెళ్లే రాకపోకలు నిషేధించడంతో ఏర్పాటుచేసిన బారికేడ్లు

కాకినాడ క్రైం, జూన్‌ 3: కాకినాడ జిల్లా పార్లమెంట్‌, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం కాకినాడ జేఎన్‌టీయూ క్యాంపస్‌, జేఎన్‌టీయూ స్టేడియం ప్రాంగణాల్లో జరగనున్న నేపఽథ్యంలో కాకినాడకు రాకపోకలు సాగించే వాహనాల ట్రాఫిక్‌ మళ్లింపునకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్‌ సోమవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. ఈ దారి మళ్లింపు ప్రక్రియ మంగళవారం తెల్లవారు జా మున 4 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు కొనసాగుతుందన్నారు. పిఠాపురం నుంచి కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, పెద్దపూడి వెళ్లవలిసిన వాహనాలు పిఠాపురం, చిత్రాడ నుంచి తిమ్మాపురం వై జంక్షన్‌ వద్ద కుడి వైపునకు తీసుకుని కొత్తగా వేసిన బైపాస్‌ మార్గం ద్వారా ఏడిబి రోడ్డులోకి ప్రవేశించి కొప్పవరం జంక్షన్‌ నుంచి కుడివైపునకు తీసుకుని ఉండూరు బ్రిడ్జి మీదుగా సామర్లకోట వెళ్లేవారు కుడివైపునకు, ఇంద్రపాలెం వెళ్లేవారు ఎడమవైపునకు వెళ్లాలన్నారు. అలాగే కాకినాడ పట్టణంలోకి వెళ్లాల్సిన వారు ఉండూరు బ్రిడ్జి వద్ద ఎడమవైపునకు తీసుకుని కెనాల్‌రోడ్డు మీదు గా మాధవపట్నం, ప్రతాప్‌నగర్‌ బ్రిడ్జి, ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఎడమవైపునకు తీసుకుని వారి గమ్యాలకు చేరాలన్నారు. అలాగే పెదపూడి, రామచంద్రపురం. యానాం, అమలాపురం వెళ్లవలిసిన వాహనదారులు పై మార్గంలో వచ్చి ఇంద్రపాలెం బ్రిడ్జి నుండి కుడివైపునకు తీసుకుని చీడిగ కొత్త బైపాస్‌ మీదుగా పెదపూడి వైపు వెళ్లాలన్నారు. అలాగే రామచంద్రపురం వైపు వెళ్లాల్సిన వాహనదారులు పైమార్గం ద్వారా వచ్చి చీడిగ కొత్తగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎడమవైపునకు తీసుకుని బైపాస్‌ మీదుగా ఎన్‌హెచ్‌-216 తూరంగి బ్రిడ్జి వద్ద కుడివైపునకు తీసుకుని రామచంద్రపురం వైపునకు ప్రయాణించవచ్చన్నారు. అలాగే తాళ్లరేవు, యానాం, అమలాపురం వెళ్లాల్సిన వాహనదారులు పైమార్గం ద్వారా వచ్చి తూరంగి బ్రిడ్జి నుండి నేరుగా ఉప్పలంక వై జం క్షన్‌ మీదుగా యానాం వైపు వెళ్లవచ్చన్నారు. అదేవిధం గా కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, తుని, విశాఖప ట్నం వైపు వెళ్లాల్సిన వాహనదారులు అమలాపురం, యానాం మీదుగా వచ్చే వాహనదారులు ఉప్పలంక వై జంక్షన్‌ వద్ద నుంచి ఎడమవైపునకు తీసుకుని తూరంగి బ్రిడ్జి మీదుగా చీడిగ బ్రిడ్జి వద్దకు చేరుకుని కుడివైపున కు తీసుకుని ఇంద్రపాలెం బ్రిడ్జి మీదుగా ఎడమవైపున కు తీసుకుని కెనాల్‌ రోడ్డులో సామర్లకోట వైపు వెళ్లవచ్చన్నారు. అదేవిధంగా ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద నుంచి కుడివైపునకు తీసుకుని కాకినాడ నగరంలోకి ప్రవేశించవచ్చన్నారు. అలాగే పిఠాపురం వెళ్లాల్సిన వాహనదారులు సామర్లకోట మీదుగా లేదా కెనాల్‌ రోడ్డులోని ఉండూరు బ్రిడ్జి వద్దకు చేరుకుని అక్కడ నుంచి కుడివైపునకు తీసుకుని ఏడిబి రోడ్డులో గల కొప్పవరం జంక్షన్‌ వద్ద కొత్తగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎడమవైపునకు తీసుకుని తిమ్మాపురం వైజంక్షన్‌ నుంచి ఫిఠాపురం వెళ్లవచ్చన్నా రు. ఇక కాకినాడ నుంచి సామర్లకోట, పిఠాపురం వెళ్లా ల్సిన వాహనదారులు భానుగుడి జంక్షన్‌ నుంచి ముత్తాగోపాలకృష్ణ వారఽఽథి మీదుగా శారదాదేవిగుడి, కర్ణంగారి జంక్షన్‌ నుంచి కుడివైపునకు తీసుకుని గైగొలుపాడు జం క్షన్‌, సర్పవరం పూల మార్కెట్‌ మీదుగా మాధవపట్నం సెంటర్‌, కెనాల్‌ రోడ్డు మీదుగా సామర్లకోట వైపు, పిఠాపురం వైపు వెళ్లవచ్చన్నారు. ఇటు కాకినాడ పోర్ట్‌ తదిత ర ప్రాంతాలకు రాకపోకలు సాగించే భారీ వాహనాలను కాకినాడ నగరంలోకి ప్రవేశించకుండా రాజానగరం నుంచి సామర్లకోట వరకు గల ఏడిబి రోడ్డులో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు నిలుపుదల చేయాలని ఎస్పీ చెప్పారు. కత్తిపూడి బ్రిడ్జి నుంచి కాకినాడ పోర్ట్‌కు వచ్చే భారీ వాహనాలు కత్తిపూడి జంక్షన్‌ వద్ద నిలుపుదల చేయాలని, కాకినాడ లైట్‌హౌస్‌ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు లైట్‌హౌస్‌ సూర్యపేట జంక్షన్‌ వద్ద, అటు ఉప్పలంక వై జంక్షన్‌ వద్ద నిలుపుదలచేయాలని కోరారు.

Updated Date - Jun 04 , 2024 | 01:07 AM