Share News

ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:31 AM

ఎన్నికల సంఘం ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కఠినచర్యలు తప్పవని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు.

ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే  కఠిన చర్యలు

ఎన్నికల విధులపై అధికారులకు దిశా నిర్ధేశం చేసిన కమిషనర్‌

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 6: ఎన్నికల సంఘం ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కఠినచర్యలు తప్పవని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఎన్నికల సంఘం కల్పించిన హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం గురించి వివరించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు, 40శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన వారి ఐచ్ఛికం మేరకు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేయలేని దివ్యాంగులకు, కొవిడ్‌ బాధితులకు ఇంటి దగ్గరే ఓటువేసే సౌకర్యం కల్పించనున్నదని చెప్పా రు. ఇప్పటికే ఆయా అంశాలను పరిగణంలోకి తీసుకుని ఓటర్లను గుర్తించామన్నారు. వారికి 12డి నమూనాలో దరఖాస్తులు చేయిస్తారన్నారు. అలా దరఖాస్తు చేసిన వారు బూత్‌లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో), సెక్టార్‌ అధికారులు ద్వారా ఓటు వేస్తారన్నారు. దీనికోసం సంచార ఓటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సౌకర్యం పొందాలనుకునే వారు తగిన ఆధారాలు చూపించాలన్నారు. 12డి దరఖాస్తులు ఇవ్వడానికి వారి ఇంటికి వెళ్లినప్పుడు వారు లేకపోతే బీఎల్‌వో, సెక్టార్‌ అధికారి వివరాలు తెలిసే విధంగా పేపరు అంటించి ఫొటో తీసుకుని భద్రపరుచుకోవాలని ఆదేశించారు. 12డి దరఖాస్తు చేసుకున్నవారు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని ఇంటి వద్దే ఓటు వేయాలన్నారు. రాజమహేంద్రవరంలో 6600 మంది హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం పొందాల్సి ఉందని గుర్తించినట్టు చెప్పారు. అలాగే సెక్టారు ఆఫీసర్లు అందరూ తమ సెక్టారుకు చెందిన పోలింగ్‌స్టేషన్‌ చేరే రూట్‌ను పరిశీలించి ఎవరైనా మార్పు చేయాల్సి వుంటే వెంటనే తెలియజేయాలన్నారు. పో లింగ్‌ స్టేషన్లలో కల్పించాల్సిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రైవే ట్‌ బిల్డింగ్‌లో వున్న పోలింగ్‌ కేంద్రాల్లో నిర్ధేశించిన సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సెక్టారు పోలీ స్‌ అధికారులు, సెక్టారు అధికారులు కలిసి గుర్తించాలని అందుకు ఎన్నికల సం ఘం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఏడుఅంశాల ప్రకా రం పోలింగ్‌ కేంద్రాలు వర్గీకరించాలని ఆదేశించారు. ఈనెల 9న ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడానికి నియమించిన మాస్టర్‌ట్రైనర్లు తమకు కేటా యించిన అంశాలపై సవివరమైన నోట్స్‌ తయారు చేసుకోవాలని బూత్‌ లెవెల్‌ అధికారులకు, సూపర్‌వైజర్లు, సెక్టారు అధికారులకు ఆదేశించారు. సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పీఎం సత్యవేణి, సిటీ ప్లానర్‌ జీవీఎస్‌ఎన్‌ మూర్తి, డిప్యూటీ కమిషనరు ఎస్‌వీ రమణ, సెక్రటరీ కేటీ సుధాకర్‌, తహశీల్దార్‌ అర్బన్‌, సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు, సెక్టారు అధికారులు, సెక్టారు పోలీసు అధికారులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:31 AM