Share News

సమయంలేదు మిత్రమా..

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:49 AM

సమయంలేదు మిత్రమా.. రణమా..శరణమా.. సార్వ త్రిక ఎన్నికలు వచ్చేశాయి.. పోలింగ్‌కు ఇక మిగిలింది నెలరోజులే..ఈ నెల రోజులు ఓటర్‌ సమయమే.. ఓటరు ఏదనుకుంటే అది చేయవచ్చు.ఎవరిని గెలిపించుకోవా లంటే వారిని గెలిపించుకోవచ్చు..ప్రభుత్వంపై వ్యతి రేకత కారణంగా ఇప్పటికే ఓటరు సన్నద్ధమైపోయాడు. ఈ సారి ఎన్నిక లాంఛనమే అనేది మేధావుల వాదన..

సమయంలేదు మిత్రమా..

మే 13న పోలింగ్‌

ఈ నెల 18 నుంచి నామినేషన్లు

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

జోరుగా అభ్యర్థుల ప్రచారం..

చకచకా సాగుతున్న ఏర్పాట్లు

తుది జాబితాలో పెరిగిన ఓటర్లు

జిల్లాలో ఓటర్లు 16.16 లక్షలు

పురుషులు 7,89,443

మహిళలు 8,27,380

రేపటి వరకూ ఓటు నమోదు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

సమయంలేదు మిత్రమా.. రణమా..శరణమా.. సార్వ త్రిక ఎన్నికలు వచ్చేశాయి.. పోలింగ్‌కు ఇక మిగిలింది నెలరోజులే..ఈ నెల రోజులు ఓటర్‌ సమయమే.. ఓటరు ఏదనుకుంటే అది చేయవచ్చు.ఎవరిని గెలిపించుకోవా లంటే వారిని గెలిపించుకోవచ్చు..ప్రభుత్వంపై వ్యతి రేకత కారణంగా ఇప్పటికే ఓటరు సన్నద్ధమైపోయాడు. ఈ సారి ఎన్నిక లాంఛనమే అనేది మేధావుల వాదన.. జిల్లాలోని లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికార్లను నియమించారు.ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబం ధించిన అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు.ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూ డడానికి నిఘా పెంచారు. సరిహద్దులు, ముఖ్య కూడళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదికవి నన్న య వర్సిటీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు.. పోలింగ్‌కు 1569 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్యక ప్రాంతాలను కూడా గుర్తించారు.

18 నుంచి నామినేషన్ల స్వీకరణ..

మే 13న పోలింగ్‌ జరగనుంది.నామినేషన్ల ప్రక్రియకు ఈనెల 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయ నుంది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి నామి నేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. గత నెల 16న ఎన్నికల షెడ్యూల్‌ రావడం, కోడ్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 18 నుంచి 25వ తేదీ వర కూ నామినేషన్లు స్వీకరిస్తారు. 26న పరి శీలిస్తారు. 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివ రి తేదీగా నిర్ణయించారు.అదే రోజు తుది జాబితా ప్రకటి స్తారు.ఆ రోజు బరిలో ఎవరున్నారో స్పష్టమవుతుంది. మే 13న జిల్లాలో పోలింగ్‌. జూన్‌ 4న ఓట్లు లెక్కిస్తారు. ఆదికవి నన్నయ వర్సిటీలో రెసెప్షన్‌ కేంద్రం, అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీ స్ర్టాంగ్‌రూమ్‌లు, కౌం టింగ్‌ కేంద్రాలు తదితర ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్‌ డా.కె.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో దాఖలు చేయాలి. రాజమహేంద్రవరం అర్బన్‌ అభ్యర్థులు ముని సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీసు, రూరల్‌ అభ్యర్థులు కలెక్టరేట్‌ లోని జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో, అనపర్తి అభ్య ర్థులు అనపర్తి ఎంపీడీవో ఆఫీసు, రాజానగరం అభ్య ర్థులు రాజానగరం ఎంపీడీవో ఆఫీసులోనూ, కొవ్వూరు అభ్యర్థులు కొవ్వూరు సబ్‌-కలెక్టర్‌ కార్యాలయం, నిడద వోలు అభ్యర్థులు తహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రామకచేరి కార్యాలయంలో, గోపాలపురం అభ్య ర్థులు తహశీల్దార్‌ కార్యాలయంలో దాఖలు చేయాలి.

336 సమస్యాత్మక కేంద్రాలు..

రాజానగరం నియోజకవర్గంలో 216 పోలింగ్‌ కేం ద్రాలు ఉండగా అతిసమస్యాత్మక 10, 50 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. అనపర్తిలో 228 పోలింగ్‌ కేంద్రా లకు 67 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. రాజమ హేం ద్రవరం సిటీలో 232 కేంద్రాలకు 13 అతిసమస్యాత్మక, 36 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. రూరల్‌లో 264 కేంద్రాలకు అతిసమస్యాత్మక 7, సమ స్యాత్మక కేంద్రాలు 15 ఉన్నాయి. కొవ్వూరులో 176 పోలింగ్‌ కేంద్రాలకు 35 సమస్యాత్మక, నిడదవోలులో 205 కేంద్రాలకు 41 సమ స్యాత్మక, గోపాలపురంలో 248 కేంద్రాలకు 62 సమ స్యాత్మక కేంద్రాలు ఉన్నాయి.మొత్తం జిల్లాలో 1569 పోలి ంగ్‌ కేంద్రాలు ఉండగా అతిసమస్యాత్మక 30 కేం ద్రాలు 306 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. మిగతా 1263 సాధారణ కేంద్రాలుగా గుర్తించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 9809 మంది ఉద్యోగులకు బాధ్య తలు అప్పగించారు.ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 1569 మంది, అసి స్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 1569 మంది, ఇతర పోలింగ్‌ అధికారులు 6276,మైక్రో అబ్జర్వర్లు 395 మందిని నియమించారు.

ఓటర్లు 16,16,918

జిల్లాలో మొత్తం 16,05,762 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య కొద్దిగా పెరి గింది. ఇప్పటి వరకూ 11,156 మంది ఓటర్లు పెరిగారు.దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 16,16,918 అయింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకో వచ్చు. ఇప్పటి వరకూ పురుషులు 7,89,443 మంది, మహిళలు 8,27,380 మంది, థర్డ్‌ జండర్‌ 95. గతంలో వీరి సంఖ్య 105 ఉండేది. ఎందుకో పది మంది తగ్గారు.జిల్లాలో పురుషుల కంటే 37,937 మంది మహిళా ఓటర్లు ఎక్కువ. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇక జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం రాజమహేంద్రవరం రూరల్‌.. 2,72,440 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 1,39,364, పురుషులు 1,33052. థర్డ్‌ జండర్‌ 24 మంది ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కొవ్వూరు..మొత్తం ఓటర్లు 1,83,603 మంది, పురుషులు 89,496 మంది, మహిళలు 94,102 మంది, థర్డ్‌ జెండర్‌ ఐదుగురు ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ రెండో స్థానంలో ఉంది.2,65,479 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 1,37,656, పురుషులు 1,27,773 మంది, థర్డ్‌ జండర్లు 50 మంది ఉన్నారు. గోపాలపురం నియోజక వర్గం ఓటర్ల పరంగా మూడో స్థానంలో ఉంది.. 2,41,840 మంది ఉండగా, పురుషులు 1,18,552 మంది, మహిళలు 1,23,283 మంది, థర్డ్‌ జెండర్‌ ఐదుగురు ఉన్నారు. అనపర్తి నాలుగో స్థానంలో ఉంది. 2,25,188 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,10,125, మహిళలు 1,15,060, థర్డ్‌ జండర్‌ ముగ్గురు ఉన్నారు. రాజానగరం ఐదో స్థానంలో ఉంది. 2,15,584 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,06,473, మహిళలు 1,09,107 మంది, థర్డ్‌ జెండర్‌ నలుగురు ఉన్నారు. నిడదవోలు ఆరో స్థానంలో ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,12,784 పురుషులు 1,03,972, మహి ళలు 1,08,808, ట్రాన్స్‌జెండర్స్‌ నలుగురు ఉన్నారు. కొవ్వూ రు అతి తక్కువ ఓట ర్లతో చివరి స్థానంలో ఉంది..

సైకిల్‌ జోరు.. ఫ్యాన్‌ బేజారు..

టీడీపీ-జనసేన,బీజేపీ కూటమిలో జోష్‌ పెరిగింది. అభ్యర్థులు అందరూ గట్టివారే. లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్‌టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బరిలో దిగారు. రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థి ఆదిరెడ్ది వాసు,రూరల్‌ అభ్యర్థి గోరంట్ల బుచ్చ య్య చౌదరి, రాజానగరం అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాల పురం అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు, నిడదవోలు అభ్యర్థి కందుల దుర్గేష్‌ ప్రచారంలో దూసుకుపోతు న్నారు. ఇక అనపర్తి సీటు తిరిగి టీడీపీకే దక్కనుంది. ఈ మేరకు రేపో మాపో అధికారిక ప్రకటన రానుంది. దీంతో అక్కడి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం తిరిగి ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రచారం వేగవంతం చేశారు. వైసీపీలో ఇంత వరకూ పెద్దనేతల ఎవరూ ప్రచారానికి రాలేదు.కూటమికి ఇప్పటికే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, పురందేశ్వరి ఓ ఊపునిచ్చిన సంగతి తెలి సిందే. టీడీపీలో అసంతృప్తులన్నీ సద్దుమణగగా,వైసీ పీలో మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంది. ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు. ఈ నెల 16న వైసీపీ అధినేత, సీఎం జగన్‌ సిద్ధం సభ జిల్లాలో ఉండవచ్చని చెబుతున్నారు. కానీ జనసమీకరణ ఎలా అనే సమస్యతో నేతలు తలపట్టుకున్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:49 AM