Share News

18వ సారీ హోరాహోరీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:20 AM

రాజమహేంద్రవరం లోక్‌సభకు మంచి చరిత్రే ఉంది. అనేకమంది ప్రము ఖులు, సినీతారలు ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 9సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారాయి.

18వ సారీ హోరాహోరీ

రాజమహేంద్రవరం లోక్‌సభకు భలే చరిత్ర కూటమి

1952 నుంచి ఇప్పటివరకూ 17సార్లు ఎన్నికలు

కూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి

వైసీపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం ఓటర్ల సంఖ్య 16,16,918 మంది

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం లోక్‌సభకు మంచి చరిత్రే ఉంది. అనేకమంది ప్రము ఖులు, సినీతారలు ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 9సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారాయి. తర్వాత మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు బీజేపీ, ఒకసారి వైసీపీ గెలిచారు. 1952లో జరిగిన తొలి ఎన్నికలలో ఇది ద్విసభ్య నియోజకవర్గంగా ఉండడంతో కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి కానేటి మోహనరావు, సోషలిస్ట్‌ పార్టీ నుంచి నల్లా రెడ్డినాయుడు గెలిచారు. ఇక్కడి నుంచి ప్రముఖ సినీనటులు జమున, మాగంటి మురళీమోహన్‌ కూడా విజయం సాధించడం గమనార్హం. ఈసారి రాజమహేంద్రవరం లోక్‌సభ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నటసార్వభౌమ ఎన్టీఆర్‌ కూతురు, టీడీపీ అధినేత మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి సోదరి దగ్గుబాటు పురందే శ్వరి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా. కాంగ్రెస్‌ తరపున పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పోటీ చేస్తుండగా, వైసీపీ తరపున రాజకీయాలకు కొత్తఅయిన డాక్టర్‌ గూడూరి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.

రాజమహేంద్రవరం లోక్‌సభ చరిత్ర

రాజమహేంద్రవరం లోక్‌సభకు 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. తొలి ఎన్నికలలో సోషలిస్ట్‌ పార్టీ తరపున నల్లా రెడ్డినాయుడు, కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి కానేటి మోహనరావు విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్‌, టీడీపీ హవా కొనసాగింది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుంచి 1957, 1962లో దాట్ల సత్యనారాయణరాజు, 1967, 1971, 1997, 1980లలో ఎస్‌బీపీ పట్టాభి రామారావు విజయం సాధించారు. 1984లో టీడీపీ అభ్యర్ధి చుండ్రు శ్రీహరి గెలిచారు. 1989లో ప్రముఖ సినీనటి జమున కాంగ్రెస్‌ తరపున గెలవ గా, 1991లో టీడీపీ అభ్యర్థి కేవీఆర్‌ చౌదరి గెలిచారు. 1996లో మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి చిట్టూరి రవీంద్ర విజయం సాఽధించారు. తర్వాత 1998లో తొలిసారి బీజేపీ అభ్యర్థి గిరజాల వెంకటస్వామినాయుడు గెలిచారు. 1999 లో మళ్లీ ఎన్నికలు జరగగా, టీడీపీ మద్ధతుతో బీజేపీ అభ్యర్థి ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉండవల్లి అరుణకుమార్‌ విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్‌ గెలుపొందారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ గెలిచారు.

రాజమహేంద్రవరం బరిలో పురందేశ్వరి

కూటమి అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బరిలో ఉ న్నారు. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేతలలో బాగా రాణిస్తున్న నేత ఆమె. మాజీ కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. బీజేపీకి రాష్ట్రంలో తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా ఆమె ఎనలేని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బీజేపీలో కూడా జోష్‌ పెరిగింది. క్యాడర్‌లో కదలిక వచ్చింది. అంతకు ముందు నేతలు క్యాడర్‌ పట్టించుకోలేదని, కనీసం సొంత అనుచరులను కూడా గాలికి వదిలేశారనే ఆవేదన ఉంది. పురందేశ్వరి పార్టీలోని పాత, కొత్తనేతలందరినీ కలుపుకుంటూ, పలుకుబడిని పెంచారు. దానికితోడు జనసే న అధినేత పవన్‌ కల్యాణ్‌ కృషితో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కూడా కుదిరింది. దీంతో ఆమెను చారిత్రక రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దించారు. రాజమహేంద్రవరం నుంచి గతంలో బీజేపీ రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే. లోక్‌సభకు రెం డుసార్లు, అర్బన్‌ ఎమ్మెల్యే స్థానం నుంచి ఒకసారి గెలిచింది. రెండుసార్లు టీడీపీతో పొత్తు వల్లే గెలిచింది. ఈసారి ఏకంగా టీడీపీ-జనసేన కూడా కలవడంతో బీజేపీ అభ్యర్థికి బాగా బలం పెరిగినట్లయింది. ఈ లోక్‌సభ స్థానం గోదావరికి అటూఇటూ ఉన్న ప్రాంతం. ఈస్థానం టీడీపీకి కంచుకోట. పోల్‌మేనేజ్‌మెంట్‌, వర్గాల సమీకరణ వ్యూహాత్మకంగా ఉంటే టీడీపీ నుంచి ఈ స్థానాన్ని ఎవరూ తన్నుకుపోలేనంత క్యాడర్‌ టీడీపీకి ఉంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 1984 నుంచి 2019వరకూ జరిగిన పది లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ మూడుసార్లు, బీజేపీ రెండుసార్లు, కాంగ్రెస్‌ నాలుగుసార్లు, వైసీపీ ఒకసారి గెలిసింది. గెలిచిన ప్రతీసారీ ఓట్లశాతం పరిశీలించినా, మెజా ర్టీ శాతం పరిశీలించినా టీడీపీకే అధికంగా ఓట్లు తెచ్చుకోవడం గమనార్హం. రాష్ట్ర విభజన తర్వాత మొదటగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజ మహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ సినీనటుడు మాగంటి మురళీమోహన్‌ ఘన విజయం సాధించారు. అప్పట్లో 6,30,573 ఓట్లు అంటే 54.62 శాతం ఓట్లు సాధించారు. అంతకుముందు జరిగిన ఎన్నికల కంటే అదనంగా 19.72శాతం సాధించారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉండవల్లి అరుణకుమార్‌ చేతిలో కేవలం 2,147 ఓట్ల తేడాతో మురళీ మోహన్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికలలో ఇంతవరకూ ఎవరికీ రానంత మెజార్టీ ఆయనకు వచ్చింది. ఏకంగా 1,67,434 ఓట్ల మెజార్టీ లభించింది. ఇది 14.29శాతం మెజార్టీ. అప్పట్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొడ్డు వెంకటరమణకు 4,63,139 ఓట్లు వచ్చాయి. అది 40.12శాతం. కానీ 2019లో తెలుగుదేశం, జనసేన వేర్వేరుగా పోటీచేసి దెబ్బతిన్నాయి. టీడీపీ తరపున మాగంటి మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప పోటీచేసి 4,60,390ఓట్లు అంటే 36.82శాతం తెచ్చుకోగలిగారు. జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పోటీ చేసి, 1,55,807 ఓట్లు అంటే 12.46శాతం సాధించారు. ఈ ఇద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌ 5,82,024 ఓట్లు అంటే 46.55శాతం ఓట్లు సాధించి, 1,21,634 ఓట్లు మెజార్టీ సాధించారు. ఇది 9.73శాతం మెజార్టీ.. ఈసారి ఈ లెక్కలేకాక, అధికారపార్టీ మీద ఉన్న ప్రజలలో వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యతవల్ల ఉమ్మడి అభ్యర్థి బలమే ఎక్కువ ఉం టుంది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గూడూరి శ్రీనివాసరావు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక కాంగెస్‌ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీ డబ్ల్యుసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు ఇక్కడ బరిలోకి దిగారు. ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. కూటమి బలంగా బాగా పెరగగా, కాంగ్రెస్‌ అభ్యర్థి వల్ల ఇప్పటికే కష్టాలలో ఉన్న వైసీపీ అభ్యర్థికి మరింత నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పరిశీలకుల అంచనా. జిల్లాలో ఇప్పటి వర కూ మొత్తం ఓటర్ల సంఖ్య 16,16,918మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 8,27,380 మంది, పురుషులు 7,89,443మంది ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.

న్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:21 AM