Share News

డ్వామా పీడీగా జగదాంబ తొలగింపు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:28 AM

డ్వా మా పీడీ పి.జగదాంబను విధుల నుంచి తొల గిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎ. సూర్య కుమారి ఈనెల 12న తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

డ్వామా పీడీగా జగదాంబ తొలగింపు

రాజమహేంద్రవరం,జనవరి16(ఆంధ్రజ్యోతి) : డ్వా మా పీడీ పి.జగదాంబను విధుల నుంచి తొల గిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎ. సూర్య కుమారి ఈనెల 12న తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. కత్తిపూడి డీఎల్‌డీవోగా తిరిగి చేరవలసిందిగా ఆదేశిం చారు.వాస్తవానికి ఉపాఽధి హామీ సిబ్బంది ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిసిం ది.కొత్త జిల్లా ఏర్పడినప్పుడు మొదట కొవ్వూరు ఎంపీ డీవోగా ఉండేవారు.తర్వాత డ్వామా పీడీగా బాధ్యతలు స్వీక రించి, కొద్దినెలల తర్వాత డీపీవోగా నియమితుల య్యారు. ఓ ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల ఆమెను డీపీవోగా తప్పించినట్టు సమాచారం. కొద్దిరోజులు ఖాళీగా ఉన్న జగదాంబ తిరిగి డ్వామా పీడీగా ఐదు నెలల కిందట బాధ్యతలు చేపట్టారు.ఇదిలా ఉండగా పండుగ సమ యంలో ఆమెను తొల గించి కత్తిపూడి డీఎల్‌డీవోగా చేరాలని ఆదేశించడం గమనార్హం.

Updated Date - Jan 17 , 2024 | 12:28 AM