Share News

కొవ్వూరు డీఎస్పీపై వేటు

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:40 AM

ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్ల క్ష్యం వహించిన పోలీస్‌ అధికారిపై వేటు పడింది. కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్‌ రామారావు విధుల్లో అలసత్వం వహించడం, కింది సిబ్బందిని వేధించడం, అక్రమార్కులతో చేతులు కలపడంపై ‘పోలీస్‌ దందా’ పేరుతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే.

కొవ్వూరు డీఎస్పీపై వేటు
వేటుపడిన డీఎస్పీ రామారావు

క్రైమ్‌ డీఎస్పీ శ్రీనివాసమూర్తికి బాధ్యతలు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

రాజమహేంద్ర వరం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్ల క్ష్యం వహించిన పోలీస్‌ అధికారిపై వేటు పడింది. కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్‌ రామారావు విధుల్లో అలసత్వం వహించడం, కింది సిబ్బందిని వేధించడం, అక్రమార్కులతో చేతులు కలపడంపై ‘పోలీస్‌ దందా’ పేరుతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనం పోలీసు వర్గాల్లో సంచలనం రేపింది. ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. వేగంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.సాయంత్రానికి రామారావును విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. విజయవాడలోని డీజీపీ కార్యాల యంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. కొత్త డీఎస్పీ(ఇన్‌చార్జి ఎస్‌ డీపీవో)గా జిల్లాలోని క్రైం డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కె.శ్రీనివాసమూర్తిని నియమించారు. ఆయన ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. రామారావు గుంటూరు నుంచి ఎన్నికల కోటాలో బదిలీపై ఈ ఫిబ్రవరిలో జిల్లాకు వచ్చారు. రామారావు బదిలీపై సబ్‌-డివిజన్‌లోని బాధిత సిబ్బంది ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.

Updated Date - Jun 03 , 2024 | 12:40 AM