Share News

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:43 AM

యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాశ్‌బాబు పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు

డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రకాశ్‌బాబు

మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

రాజమహేంద్రవరం, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాశ్‌బాబు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిషేధంపై ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు స్నేహాల వల్ల లేదా పరిస్థితుల ప్రభావంతో తాత్కాలిక ఆనందం కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక రుగ్మతలభారిన పడతారన్నారు. ఎన్‌డీపీ ఎస్‌ యాక్ట్‌-1985పై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయవిక్రయాలు అన్నీ క్రిమినల్‌ నేరాలని.. కఠినశిక్షలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్లు వాటి నుంచి విముక్తి కోసం స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా ఉండదన్నారు. ఉచితంగా వైద్య సహాయం అంది స్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రామచంద్రరావు పాల్గొన్నారు.

ఫ మాదకద్రవ్యాల నివారణాదినోత్సవం సందర్భంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌ఏవీటీ, రాజేంద్రనగర్‌ జడ్పీ హైస్కూల్‌లో అవగాహనా కార్యక్ర మాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగంవల్ల కలిగే నష్టాలను వివ రించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ సోమశేఖర్‌, సెబ్‌ ఇంచార్జి ఏఈఎస్‌ టి.గోపాలకృష్ణ, నార్త్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో డా.ఎన్‌.నిక్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంకల్చరల్‌: స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశా లలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, జనవిఙ్ఞాన వేదిక బుధవారం విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీలో ఆదిత్య డి గ్రీ, పీజీ, నాలుగు కళాశాలల విద్యార్థులు కలిపి 100 మందికి పైగా పాల్గొన్నారు. యువతపై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడడం మన అందరి బాధ్యత అని ఆదిత్య కల్చరల్‌ కోఆర్డినేటర్‌ బిహెచ్‌ రమాదేవి అన్నారు. ఈ పోటీలను నిర్వహించిన జనవిఙ్ఞాన వేదిక శ్రీరామమూర్తిని ఆమె అభినంది ంచారు. ఈ పోటీల నిర్వహణకు సోను దుర్గాప్రసాద్‌, బిహెచ్‌ రమాదేవి, వెంక ట్రావ్‌, ఎల్‌.వేంకటేశ్వరరావు, కృష్ణకుమారి, చంద్రశేఖర్‌, రామకృష్ణ, రాంబాబు సహకరించారు.

ఫశ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపా ల్‌ పి.రాఘవకుమారి ఆధ్యక్షతన కళాశాల యూత్‌ రిడ్‌క్రాస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కెఎస్‌ రత్నకుమార్‌ నిర్వహణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సౌత్‌జోన్‌ డీఎస్పీ అంబికా ప్రసాద్‌ మాట్లాడారు. సీఐ పుల్లారావు,ఽ ధన్వంతరి బ్లడ్‌ బాంక్‌ డాక్టర్‌ సూర్యప్రకాష్‌, డాక్టర్‌ కె.వి. రమణ, మహలక్ష్మి, డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ వై.ప్రకాష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

‘మత్తు పదార్ధాలు, మద్యపానానికి దూరంగా ఉండండి’

ధవళేశ్వరం: మత్తు పదార్ధాలు, మద్యపాన వ్యసనానికి జీవితాన్ని నాశనం చేసుకోకుండా వాటికి దూరంగా ఉండాలని దక్షిణ మండలి డీఎస్పీ అంబికా ప్రసాద్‌ విద్యార్థులకు ఉద్భోదించారు. అంతర్జాతీయ మత్తు పదార్ధాలు, మద్యపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం స్ధానిక వివేకానంద ఐటీఐలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ జి. వినయ్‌మోహన్‌, సిబ్బంది, ఐటీఐ ప్రిన్సిపాల్‌ సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

కడియం: యువత మత్తు పథార్థాలకు దూరంగా ఉండాలని కడియం ఇన్‌స్పెక్టర్‌ బి.తులసీదర్‌ తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం కాలేజీ విద్యార్థులకు మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రబావాలను వివరించారు. కడియం ఉన్నత పాఠశాల విద్యార్థులతో దేవీచౌక్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం టి.సత్యనారాయణ, ఉపాద్యాయుడు గొల్లపల్లి సత్యనారాయణ, పీడీ కె వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం

దివాన్‌చెరువు: మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవ ద్దని ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ ఎం.కిషోర్‌ కుమార్‌ విద్యార్ధులకు సూచించారు. దివాన్‌ చెరువులోని వీజేఎస్‌ కళాశాలలో బుధవారం డ్రగ్స్‌ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా బుఽధవారం విద్యా ర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎన్‌వివి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ నరేంద్ర, సీఐ ఉమర్‌ అబ్ధుల్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశ భవిష్యత్‌ యువతపైనే ఆధారం

కొవ్వూరు: దేశ భవిష్యత్‌ యువతపై ఆధారపడి ఉందని కొవ్వూరు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, ఎస్‌ఈబీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులతో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల వినియో గం వలన కలుగు అనర్ధాలను వివరిస్తూ పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ర్యాలీ చేపట్టారు. విజయవిహార్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు, ఎస్‌ఈబీ సీఐ జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత సమాజస్థాపనకు ప్రతి పౌరు డు సహకరించాలన్నారు. డ్రగ్స్‌, మాదవ ద్రవ్యాల వినియోగం వలన కలుగు నష్టాలపై గత వారం రోజులుగా విద్యార్ధులకు అవగాహనా సదస్సులు నిర్వహించామన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడి యువత తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్‌ వినియోగించడంవలన మానసిక, శారీరకంగా ఇబ్బందులకు గురై అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. ఎవరైనా డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా స్థానిక పోలీసులకు సమాచారం అందిం చాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జె. సునీత, అబ్యాస పాఠశాల ప్రిన్సిపాల్‌ పాలడుగుల రఘు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్‌ కళాశాల, గవర్నమెంటు హైస్కూల్‌, అబ్యాస, ఏబీఎన్‌ పీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, సంస్కృత కలాశాల విద్యార్థులు, పట్టణ ఎస్‌ఐ జుబేర్‌ మహ్మాద్‌, రూరల్‌ ఎస్‌ఐ కె.సుధాకర్‌, హెచ్‌సీ చంద్రాల బాబూరావు, పోలీసు, ఎస్‌ఈబీ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

నిడదవోలులో అవగాహన ర్యాలీ

నిడదవోలు: నిడదవోలు పట్టణంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో స్థానిక అధికార్లు విద్యార్థులతో కలసి డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ దిశగా యువత మేలుకో అంటూ అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గణేష్‌చౌక్‌ సెంటరులో మానవహారం నిర్మించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

దేవరపల్లి: జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేవరపల్లిలో ఎస్‌ఈబీ అధికారులు, పోలీస్‌ అధికారులు, బీహెచ్‌ఎస్‌ఆర్‌ వీఎల్‌ఎం డిగ్రీ కాలేజీ, అంబటి సత్యనారాయణరాజు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌ ఎదురుగా మానవ హారం నిర్వహించారు. ఎస్‌ఈబీ సీఐ కేవీస్వామి మాట్లాడు తూ మాదకద్ర వ్యాలకు యువతలోనుకాకుండా ఉండాలని మత్తు పదార్థాలకు తమ జీవితా లు, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయన్నారు. డ్రగ్స్‌పై అవగాహాన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ ఎస్‌ఐ సుధీర్‌, పోలీస్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం: మండలంలోని చివటం గ్రామంలో బుధవారం మత్తుపదార్థాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశానికి యువత ముఖ్యమని, యువత మత్తుపదార్థాల భారిన పడొద్దని పలువురు సూచించారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యువత క్రీడలవైపు ఆసక్తి చూపాలి : ఎమ్మెల్యే మద్దిపాటి

గోపాలపురం: యువత మాదకద్రవ్యాల భారిన పడకుండా క్రీడల వైపు ఆసక్తి కనపరచాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పిలుపునిచ్చారు. అంత ర్జాతీయ మాదకద్రావ్యాల నివారణ దినోత్సవంలో భాగంగా దేవరపల్లి సీఐ బాలసురేష్‌ ఆధ్వర్యంలో గోపాలపురం ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ పర్యవేక్షణలో ర్యాలీ నిరహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మద్దిపాటి మాట్లాడుతూ దేశజనాభాలో 35శాతంపైగా ఉన్న యువత దేశానికి వెన్నుముక లాంటి వారని యువత విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. గంజాయి, గుట్కా, పాన్‌పరాక్‌, ఖోకైన్‌ వంటి మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడే వారి పై ఉక్కుపాదం మోపి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌ ిసిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డ్రగ్స్‌కు ఆలవాటుపడి జీవితం నాశనం చేసుకోవద్దు

నల్లజర్ల: డ్రగ్స్‌కు ఆలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని నల్లజర్ల సీఐ దుర్గాప్రసాద్‌ అన్నారు. బుధవారం నల్లజర్ల సెంటర్‌లో ఎస్‌ఆర్‌కే విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్‌ మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని, మంచి భవిష్యత్‌ కోసం పోటీపడి చదువుకోవాలన్నారు.

భ్యులు శ్రీనివాసరెడ్డి, కవలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 08:18 AM