Share News

తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద పాట్లు

ABN , Publish Date - May 25 , 2024 | 12:17 AM

సామర్లకోట కెనాల్‌ నుంచి శశికాంత్‌నగర్‌ ఫిల్టరేషన్‌ ప్లాంట్‌కు ముడినీరు సరఫరా అయ్యే జాతీయ రహదారిలోని మెయిన్‌ పైప్‌లైన్‌ లీక్‌ మరమ్మతుల నిమిత్తం కాకినాడలోని 15 డివిజన్లలో ఈనెల 23,24,25 తేదీల్లో మూడు రోజులపాటు తాగునీటి సరఫరా నిలిపివేయడంతో రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ఉండూరు వద్ద చేపట్టిన పైప్‌లైన్‌ లీక్‌ మరమ్మతులకు అంతరాయం కలగడం వల్ల 26,27 తేదీల్లోనూ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు చెబుతుండడంతో జనం మరింత ఆందోళన చెందు తున్నారు.

తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద పాట్లు
దుమ్ములపేటలో ట్యాంకర్‌ వద్ద తాగునీటి కోసం బిందెలతో మహిళలు క్యూ

కాకినాడ సిటీ, మే 24 : సామర్లకోట కెనాల్‌ నుంచి శశికాంత్‌నగర్‌ ఫిల్టరేషన్‌ ప్లాంట్‌కు ముడినీరు సరఫరా అయ్యే జాతీయ రహదారిలోని మెయిన్‌ పైప్‌లైన్‌ లీక్‌ మరమ్మతుల నిమిత్తం కాకినాడలోని 15 డివిజన్లలో ఈనెల 23,24,25 తేదీల్లో మూడు రోజులపాటు తాగునీటి సరఫరా నిలిపివేయడంతో రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ఉండూరు వద్ద చేపట్టిన పైప్‌లైన్‌ లీక్‌ మరమ్మతులకు అంతరాయం కలగడం వల్ల 26,27 తేదీల్లోనూ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు చెబుతుండడంతో జనం మరింత ఆందోళన చెందు తున్నారు. దీంతో ఒకటో డివిజన్‌ నుంచి 13 డివిజన్లు, 49, 50 డివిజన్ల పరిఽధిలో సుమారు లక్షా 20 వేలమంది ప్రజలపై నీటి ఎద్దడి ప్రభావం పడింది. సామర్ల కోట కెనాల్‌ నుంచి శశికాంత్‌నగర్‌ ఫిల్టరేషన్‌ ప్లాంట్‌కు సరఫరా అయ్యే 21 ఎం ఎల్‌డీ ముడినీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా ఈ డివిజన్ల పరిధిలోని శశికాంత్‌ నగర్‌, శ్రీవిద్యాకాలనీ భాస్కర్‌ నగర్‌, దుమ్ములపేట, సాంబమూర్తి నగర్‌, ఏఎంజీ స్కూల్‌ ఏరియా, శ్రీనివాస బ్యాంక్‌కాలనీ, గైగోలుపాడు ప్రాంతాల్లోని రిజర్వాయ ర్లకు పంపింగ్‌ చేస్తారు. ఆ రిజర్వాయర్ల నుంచి ఆయా ప్రాంతాల ప్రజలకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. ఇప్పుడు ఈ నీటి సరఫరా ప్రక్రియ అయిదు రోజులపాటు నిలిచిపోతోంది. గతంలో అక్కడక్కడ పైప్‌లైన్ల మరమ్మతుల కోసం డివిజన్లలో తాగునీటి సరఫరా ఒకటి రెండు రోజులు మాత్రమే నిలిపివేయగా, ఈసారి 15 డివిజన్లలో అయిదు రోజులపాటు నిలిపివేయడం జరుగుతోంది. ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు పం పేందుకు ఏర్పాట్లుచేసినా ప్రజల అవసరాలకు సరిపడా నీరు మాత్రం అందే పరి స్థితి లేదు. దుమ్ములపేట, పర్లోవపేట వంటి ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో నీరు పట్టుకోవడానికి నీటియుద్ధాలే చేస్తున్నారు. ఏ డివిజన్‌కు ఎన్ని ట్యాంకర్లు, రోజుకు ఎన్ని ట్రిప్పులు తిప్పుతున్నారనే విషయమై స్థానిక నాయకు లకు సమాచారం లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

  • మంచినీటి సరఫరా నిలుపుదల

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 24: కాకినాడ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరా కోసం సామర్లకోట నుంచి శశికాంత్‌నగర్‌ ఫిల్టరేషన్‌ ప్లాంట్‌కు వచ్చే పైప్‌ లైన్‌కు లీకు ఏర్పడడంతో, దానిని అరికట్టేందుకు ఈనెల 25, 26, 27 తేదీల్లో కొన్ని ప్రదేశాల్లో మంచినీటి సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ తెలిపారు. ఈమేరకు ఓ ప్రకటన చేశారు. నగరంలోని శశికాంత్‌నగర్‌, శ్రీవిద్యకాలనీ, భాస్కర్‌నగర్‌, దుమ్ములపేట, సాంబమూర్తి నగర్‌, ఏఎంజీ శ్రీనివాస బ్యాంకు కాలనీ, గైగోలుపాడు (1 నుంచి 13,49,50 వార్డులు) ఏరియాల్లో 27 వరకు నీటి సరఫరా జరగదని తెలియజేశారు.

Updated Date - May 25 , 2024 | 12:17 AM