Share News

భోగాపురంలో జాతీయస్థాయి నాటికల పోటీలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:13 PM

పిఠాపురం రూరల్‌, జనవరి 17: సమాజం జరుగుతున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపుతూ ప్రదర్శించిన నాటికలు అందరిని ఆలోచింపజేశాయి. భోగాపురం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో ప్రారంభమైన జాతీయస్థాయి ద్వితీయ నాటికల పోటీల తొలిరోజు ప్రద

భోగాపురంలో జాతీయస్థాయి నాటికల పోటీలు
భోగాపురంలో నాటికల పోటీలను ప్రారంభిస్తున్న దృశ్యం

పిఠాపురం రూరల్‌, జనవరి 17: సమాజం జరుగుతున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపుతూ ప్రదర్శించిన నాటికలు అందరిని ఆలోచింపజేశాయి. భోగాపురం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో ప్రారంభమైన జాతీయస్థాయి ద్వితీయ నాటికల పోటీల తొలిరోజు ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. విశాఖ ఉక్కు నగరం చైతన్య కళాస్రవంతి కళాకారులు ప్రదర్శించిన (అ)సత్యం నాటిక, విశాఖ భద్రం ఫౌండేషన్‌ కళాకారులు ప్రదర్శించిన మట్టిపరిమళం నాటిక అందరిని ఆకట్టుకుంది. నాటకరంగ ప్రయోక్త దర్శకుడు, రచయిత స్వర్గీయ మలిరెడ్డి బాబి స్మారక ప్రతిభా పురస్కారాన్ని సఖినాల బ్రహ్మానందంకు అందజేశారు.

అంతకు ముందు జాతీయస్థాయి నాటికల పోటీలను ఉస్మానియా యూనివర్సిటీ థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విశ్రాంత ఆచార్యుడు జీఎస్‌ ప్రసాదరెడ్డి, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు ఖాజావలీ, సినీ రచయిత జలదంకి సుధాకర్‌ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించగా, ప్రముఖ రంగస్థల నటులు ముమ్మిడి తాతకొండ, సునయన జయశ్రీ, భోగాపురం కళాపరిషత్‌ అధ్యక్షుడు అడపా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:13 PM