Share News

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కి ఏడేళ్ల జైలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:53 AM

వర కట్న వేధింపుల కేసులో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌తో సహా నలుగురికి కోర్టు శిక్ష విధించింది.

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కి  ఏడేళ్ల జైలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): వర కట్న వేధింపుల కేసులో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌తో సహా నలుగురికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన శ్రిదంతా లక్ష్మీ లావణ్య(27)కు రైల్వే భద్రత దళం(ఆర్పీఎఫ్‌)లో కాని స్టేబుల్‌గా పనిచేస్తున్న గుజ్జల రవితో 2019 ఫిబ్రవరి 10న వివాహమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమ హేంద్రవరంలో రవి విధులు నిర్వర్తిస్తూ రైల్వే క్వార్ట ర్స్‌లో నివాసం ఉండేవారు. లావణ్యను రవితో పాటు కానిస్టేబుల్‌ తల్లిదండ్రులు గుజ్జల రాములు, గుజ్జల రమణమ్మ,బంధువులు బొమ్మిడి సుందరమ్మ, తుంగాన జయలక్ష్మి అధిక కట్నం తీసుకురావాలని వేధించి శ్రీకాకుళంలోని పుట్టింటికి పంపించేవారు కాదు. సోదరి పెళ్లి చూపులకు కూడా ఆమెను వెళ్లనీయకపోవడంతో మనస్తాపం చెంది 2021 సెప్టెంబరు 11న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.లావణ్య తండ్రి ఫిర్యాదుతో అప్పటి టూటౌన్‌ ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. ముద్దాయిలపై నేరం రుజువు కావడంతో రవికి ఏడేళ్లు, మిగతా నలుగురికి మూడేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

Updated Date - Apr 03 , 2024 | 12:53 AM