డొక్కా సీతమ్మ స్మృతులు పదిలం
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:22 AM
నిత్యాన్నదాతగా, అపర అన్నపూర్ణగా ప్రసి ద్ధి చెందిన డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఆమె స్వగ్రామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామంలోని ఆమె నివాసంలో నేటికీ సందర్శకులను ఆకర్షిస్తు న్నాయి.
(పి.గన్నవరం- ఆంధ్రజ్యోతి)
నిత్యాన్నదాతగా, అపర అన్నపూర్ణగా ప్రసి ద్ధి చెందిన డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. ఆమె స్వగ్రామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామంలోని ఆమె నివాసంలో నేటికీ సందర్శకులను ఆకర్షిస్తు న్నాయి. బ్రిటీషు ప్రభుత్వంతోపాటు ప్రపంచ దేశాల మన్నలను పొందిన సీతమ్మ వాడిన వస్తువులను వందేళ్లు దాటిన ఆమె వంశీ యులు ఇంకా అపురూపంగా భద్రపరిచారు. సీతమ్మ జీవిత చరిత్రను గతంలో పలు ప్రభు త్వాలు పాఠ్యాంశాలుగా ముద్రించి విద్యార్థి దశ నుంచే ఆమె సామాజిక సేవను వివరిం చేవారు. రానురాను సీతమ్మ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో తొలగించారు. ఈ తరుణంలో ఇటీ వలే ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీతమ్మ పేరు చిరస్థాయిగా నిలిచి ఉండేలా మధ్యాహ్న భోజన పఽథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పేరును సూచించి పెద్దపీట వేశారు. అయితే ఆ రోజుల్లో ఆకలి అని వచ్చిన వారికి వండి వడ్డించిన సీతమ్మ వాడిన పెద్ద పెద్ద వంట పాత్రలను గణపతి మందిరాలు, సత్రాలకు అందించారని ప్రస్తు తం ఉన్న ఐదవ తరం వారసులు చెప్పుకొ చ్చారు. ఆమె నివాసంలో ప్రస్తుతం చెక్కతో చేసిన భోషాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఆరోజుల్లో ఆ భోషాణంలో పాత్రలు, వంటసామగ్రి తదితర వస్తువులను సీతమ్మ భద్రపరుచుకునేవారు. అలాగే సీత మ్మ వాడిన కావిడి పెట్టెలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా బంగారం నగ లు, నగదు, ముఖ్యమైన వస్తువులతోపాటు చీరలను సైతం వాటిలో భద్రపరుచుకునేవా రట. ఇంకా వంట నిమిత్తం వినియోగించిన సన్నికాలు, రుబ్బురోలు కూడా అలాగే ఉన్నా యి. అంతేకాకుండా సీతమ్మ చివరి రోజుల్లో ఎక్కువగా కూర్చున్న కుర్చీతోపాటు తాగు నీరుకు వినియోగించిన నుయ్యి సైతం పెరట్లో అలాగే ఉన్నాయి. కాగా సీతమ్మ నివాసానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది.