Share News

స్మోకింగ్‌, డ్రింకింగే లివర్‌ వ్యాధులకు మూలం

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:35 AM

దేశంలో లివర్‌ వ్యాధుల చికిత్సలో అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, రాబోయే పదేళ్లలో ఈ రంగంలో అమెరికాతో సమానంగా ఎదుగుతామని గ్యాస్ర్టో ఎంటరాలజీ సూపర్‌స్పెషాలిటీ వైద్యనిపుణుడు, పద్మభూషణ్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి (ఏఐజీఈ, హైదరాబాద్‌) అన్నారు.

స్మోకింగ్‌, డ్రింకింగే లివర్‌ వ్యాధులకు మూలం
సమావేశంలో మాట్లాడుతున్న పద్మభూషణ్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 27 : దేశంలో లివర్‌ వ్యాధుల చికిత్సలో అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, రాబోయే పదేళ్లలో ఈ రంగంలో అమెరికాతో సమానంగా ఎదుగుతామని గ్యాస్ర్టో ఎంటరాలజీ సూపర్‌స్పెషాలిటీ వైద్యనిపుణుడు, పద్మభూషణ్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి (ఏఐజీఈ, హైదరాబాద్‌) అన్నారు. రాజమహేంద్రవరంలో గ్యాస్ర్టో ఎంటరాలజీ సొసైటీ, ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న 6వ వార్షిక రాష్ట్రస్థాయి సదస్సుకు తొలిరోజు శనివారం హాజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం, స్మోకింగ్‌, డ్రింకింగ్‌లను మానుకోవడం ద్వారా చాలా వరకూ లివర్‌ వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. బెంగుళూరుకు చెందిన డాక్టర్‌ నరేష్‌భట్‌, చెన్నయ్‌కు చెందిన డాక్టర్‌ టీఎస్‌ చంద్రశేఖర్‌ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం గ్యాస్ర్టో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ అగస్త్యరాజు శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్‌ వి.శ్రీరాములు, కోశాధికారి డాక్టర్‌ ఉమాకాంత్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ వరుణ్‌, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ స్వాప్నిక, డాక్టర్‌ కవిత పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:35 AM