Share News

జిల్లా పరిశ్రమలశాఖ ఇన్‌చార్జి జీఎంగా ఆదిశేషు

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:32 AM

ఐస్‌ ఫ్యాక్టరీకి సబ్సిడీ మంజూరు కోసం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న కాకినాడ జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ టి మురళీని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆశాఖ కమిషనర్‌ మే 23న ఉత్తర్వులు జారీచేశారు.

జిల్లా పరిశ్రమలశాఖ ఇన్‌చార్జి జీఎంగా ఆదిశేషు

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), జూన్‌ 1: ఐస్‌ ఫ్యాక్టరీకి సబ్సిడీ మంజూరు కోసం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న కాకినాడ జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ టి మురళీని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆశాఖ కమిషనర్‌ మే 23న ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో ఏలూరు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వి.ఆదిశేషును కాకినాడ జిల్లా ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీకాగా ఆయన శని వారం విధుల్లో చేరారు. కాకినాడకు చెందిన పెమ్మాడి శ్రీనివాసరావు తన భార్య శ్రీముఖి పేరుతో సర్పవరం ఆటోనగర్‌లో స్థాపించిన ఐస్‌ఫ్యాక్టరీకి ప్రభుత్వ ప్రోత్సాహకంగా రావాల్సిన సుమారు రూ.40 లక్షల నుంచి 50 లక్షల రాయితీ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.

Updated Date - Jun 02 , 2024 | 08:43 AM