7200 గృహాలు పూర్తి చేయాలి : డిప్యూటీ కలెక్టర్
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:07 AM
కార్పొరేషన్ (కాకినాడ), జూలై 4: హౌసింగ్ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్లు ఇతర జిల్లా కార్యాలయ సిబ్బందితో డిప్యూటీ కలెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ (హౌసింగ్) ఎన్‌వీవీ సత్యనారాయణ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ

కార్పొరేషన్ (కాకినాడ), జూలై 4: హౌసింగ్ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్లు ఇతర జిల్లా కార్యాలయ సిబ్బందితో డిప్యూటీ కలెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ (హౌసింగ్) ఎన్‌వీవీ సత్యనారాయణ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరియట్‌లో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం వంద రోజుల ప్రణాళిక ప్రకారం 1లక్షా28వేల గృహాలు పూర్తి చేయడంలో భాగంగా కాకినాడ జిల్లాకు సంబంధించి 7,200 గృహాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేశారు.