Share News

హైవేలో లైట్లు వేయాలని ఎప్పుడో లేఖ రాశాం

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:05 AM

రిజర్వు ఫారెస్టులో సంచరిస్తున్న చిరుత పులిని బంధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుం టు న్నామని‘ఆంధ్రజ్యోతి’కి జిల్లా ఫారెస్టు అధికారి (ఇన్‌చార్జి) భరణి తెలిపారు.

హైవేలో లైట్లు వేయాలని ఎప్పుడో లేఖ రాశాం
ఇటీవల కెమెరాకు చిక్కిన చిరుత(ఫైల్‌)

హైవేలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు

ఊర కుక్కలు..పందులే ఆహారం

‘ఆంధ్రజ్యోతి’తో డీఎఫ్‌వో భరణి

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): రిజర్వు ఫారెస్టులో సంచరిస్తున్న చిరుత పులిని బంధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుం టు న్నామని‘ఆంధ్రజ్యోతి’కి జిల్లా ఫారెస్టు అధికారి (ఇన్‌చార్జి) భరణి తెలిపారు. అభయా రణ్యం ఆనుకొని ఉన్న ఆవాసాల ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. చిరుతపులి ప్రస్తుతం దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలోమాత్రమే తిరుగుతుందని తెలిపారు. పులి జాడ కను గొనేందుకు గత 13 రోజులుగా 100 ఫ్లాష్‌ కెమెరాలు, 7 ట్రాప్‌ కేజ్‌లు, 10 సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షవీక్షణం చేస్తున్నామన్నారు. కేంద్ర పర్యావరణశాఖ ఆధ్వర్యంలో ఉన్న న్యూఢిల్లీలోని ఎన్‌టీసీఏ, రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారుల సలహాలు సూచనలు మేరకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇంత వరకూ చిరుతపులి మనుషులమీద దాడిచేసిన దాఖలాలు లేవని తెలిపారు. చిరుతపులి ఊర కుక్కలు, పందులను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు హాని జరగకుండా చిరుతపులిని బంధించ డానికి అహర్నిశం శ్రమిస్తున్నామని తెలిపారు. జాతీ య రహదారిలో హెచ్చరిక బోర్డులు, కెమెరాలు ఏర్పాటు చేశామన్నా రు.రాత్రి వేళల్లో సరిపడా లైటింగ్‌ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కు లేఖ రాసి చాలా రోజులైందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. దీంతో శాఖల మధ్య సమన్వయ లోపం పులికి వరంగా.. ప్రజలకు శాపంగా మారిందనే వాస్తవం బయట పడింది. పులి జాతీయ రహదారిని అటూ ఇటూ దాటు తోం దని అటవీ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. సరిపడా లైటింగ్‌ ఏర్పాటు చేస్తే వాహనదారులు దూరం నుంచే అప్రమత్తమై వాహన వేగం తగ్గించి సురక్షితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో అక్కడ చిమ్మచీకటి వల్ల ఒకవేళ రోడ్డు పక్కన పులి నక్కినా సమీపానికి వెళ్లే వరకూ తెలియదు. జాతీయ రహదారి పరిసరాల్లో కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ పులి రోడ్డు దాటుతున్నప్పుడు కెమెరాల్లో ఎందుకు ఫొటో పడలేదో తెలియదు.పులి దగ్గరగా వస్తే చేతులు ఊపు తూ కేకలు వేయండని దూరంగా ఉంటే నిశ్శ బ్దంగా కదలకుండా ఉండండంటూ లాజిక్‌ చెబుతున్న అధికా రులు.. అసలు పులి ఎదురుపడితే ఆ సమ యంలో సదరు వ్యక్తి పరిస్థితి ఏమిటో అంచనా వేయడంలో వెనకబడినట్టు వినవస్తోంది.ఇప్పటికైనా పులి సంచ రించే పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై సరిపడా లైట్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహ నదారులు కోరుతున్నారు.ఏదేమైనా ‘ఆపరేషన్‌ చిరుత’ ఎలాంటి దుర్ఘటనలూ జరగకుండా సాధ్యమై నంత త్వరగా ముగియాలని ప్రజలు కోరు కుంటున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 01:05 AM