Share News

4 రోజులు..రూ.5.52 లక్షలు

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:43 AM

తెలుగువారి పెద్ద పం డుగ సంక్రాంతి సందర్భంగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

4 రోజులు..రూ.5.52 లక్షలు

నిడదవోలు, జనవరి 17 : తెలుగువారి పెద్ద పం డుగ సంక్రాంతి సందర్భంగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూకట్టారు. దీంతో 4 రోజులు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో భోగి, సం క్రాంతి, కనుమ, ముక్క నుమ నాలుగు రోజులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద పెద్ద ఎత్తున మొక్కుబడులు చెల్లించుకున్నారు. 4 రోజులు అమ్మవారికి మొత్తం రూ.5,52,351లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం, ఫౌండర్‌ ఫ్యామిలి మెంబర్‌ అండ్‌ చైర్మన్‌ దేవులపల్లి రవిశంకర్‌ తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 12:43 AM