Share News

అభివృద్ధి, సంక్షేమం అందాలంటే టీడీపీని గెలిపించండి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:03 AM

నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఓటర్లను అభ్యర్థించారు.

అభివృద్ధి, సంక్షేమం అందాలంటే టీడీపీని గెలిపించండి

ధవళేశ్వరం, ఏప్రిల్‌ 25:నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఓటర్లను అభ్యర్థించారు. గురువారం ఉదయం ధవళేశ్వరంలోని ఎర్రకొండపై టీడీపీ పట్టణాధ్యక్షుడు పండూరి అప్పారావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన కుమార్తె శిరీషలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలు అందించే సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని అందు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సైకిల్‌గుర్తుపై, పార్లమెంట్‌ అభ్యర్థి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటువేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డిరాంబాబు, వెలుగు మహిళప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, యర్రా వేణు, ఆళ్ళఆనందరావు, పిన్నంటి ఏకబాబు,తలారి మూర్తి, యర్రమోతు ధర్మరాజు, వర్రే రాజేష్‌,సావాడ శ్రీనివాస రెడ్డి,నీలి కోటేశ్వరరావు, నాళ్ళ రమేష్‌, ఇళ్ళ రాంబాబు, జనసేన నాయకులు దూది సాయి, యడ్ల వెంకటేష్‌, పిల్లి శ్రీను, బీజేపీ నాయకులు స్వామి, గుర్రాల వెంకట్రావు,పి. అనూజ, లక్ష్మిప్రసన్న పాల్గొన్నారు.

గోరంట్ల విస్తృతప్రచారం

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌ : టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీషలు గురువారం రాజమహేంద్రవరం రూరల్‌ హుకుంపేట, రామకృష్ణ నగర్‌లో పర్యటించారు. తెలుగుదేశం జాతీయ ఽఅధ్యక్షులు నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మంచినీరు అందించే విధంగా చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగపరుస్తామన్నారు. ప్రజలంతా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచి అధికారంలోకి తీసుకు రావాలని ఉమ్మడి అభ్యర్ఘిగా పోటీలో ఉన్న తనకు సైకిల్‌ గుర్తుపైనా, ఎంపీ అభ్యర్థి నిగా పోటీచేస్తున్న నందమూరి తారకరామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. మత్యేటి ప్రసాద్‌, దుద్దుపూడి రామకృష్ణ, పెండ్యాల రామకృష్ణ, బొప్పన అప్పారావు, మార్ని వాసుదేవరావు, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మ, దుద్దుపూడి రమేష్‌, బొప్పన నానాజీ, యలమాటి రామకృష్ణ, మార్ని సత్యనారాయణ, పిన్నింటి ఏకబాబు, ఆళ్ళ ఆనందరావు, బొప్పన నరేంద్ర, బొప్పన సతీష్‌, కురుకూరి కిషోర్‌, మార్ని పాపారావు, బత్తిన ఏడుకొండు, మట్టా శ్రీనివాస్‌, చిట్టూరి వేణుగోపాలకృష్ణ రత్నాకర్‌ కోటిపల్లి చంద్రశేఖర్‌, ఎంఎంఎల్‌ రాజు, కోరాడ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ పిడింగొయ్యిలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీషలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మట్టా శ్రీను, మార్ని వాసు, బాసుమళ్ళ మోహన్‌, కసిరెడ్డి దుర్గాప్రసాద్‌, బాబూఖాన్‌, బొప్పన నాగేశ్వరరావు, కోరాడ వెంకటేశ్‌, పత్తి మంగ, కాపా శ్రీను, బొప్పన శ్రీను, ముప్పిడి రాంబాబు, గెడ్డం ప్రభుదాస్‌ , రామోజీ గౌరీ, దేవర్లంక మంగాయమ్మ, ఎడ్ల రామకృష్ణ, నాగరాజు, పాపారావుచౌదరి, ధనకొండ రాజు, మార్ని శ్రీను, బీజేపీ నాయకులు ఎన్‌వీబీఎన్‌ ఆచారి, కరుటూరి శ్రీనివాసరావు, తనుబుద్దిసూర్యభాస్కర్‌, తాడి కోటేశ్వరరావు, కోదండరాము, అడపా వరప్రసాద్‌; దోనేపూడి రుక్మంధరరావు పాల్గొన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఆలోచించండి

చంద్రబాబును అధికారంలోకి తీసుకురండి

ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 25: వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోక వెనుకబడిన ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆలోసించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం 38వ డివిజన్‌లో గురువారం టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు బుడ్డిగ రవి, రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి పర్యవేక్షణలో ఇంటింటా ప్రచారం చేశారు. దీనికి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, జనసేన రాజమహేంద్రవరం ఇన్‌చార్జీ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌లతో కలసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్ధానిక వ్యాపారులు, మహిళలు, కార్మికులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, తాపీ కార్మికులు, వడ్రంగి పనివార్లను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఐదేళ్ల సైకో పాలనలో విసిగి వేశారని ప్రజలు చంద్రబాబు నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ పఽథకాలను అమలు చేస్తామని చెప్పారు. ప్రతీ పనిలోను 25శాతం కమిషన్‌ తీసుకున్న భరత్‌రామ్‌ లాంటి వాడు రాజకీయాలకు పనికిరాడన్నారు. తనకు సైకిల్‌ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి పురందేశ్వరికి కమలం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవియాదవ్‌, మళ్ళ వెంకట్రాజు, శ్యామల, దేవిన సోమశేఖర్‌, చిట్టాబత్తిన గాంఽధీ, నిమిషకవి వెంకటేష్‌, రమణమూర్తి వీరబాబు, ప్రసాద్‌, ఎస్‌కె బాను, భాస్కరమ్మ, చంటి ,వరలక్ష్మి, అమ్మాజి, సింహా గణేష్‌, వై సూర్యచంద్రరావు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పేపరుమిల్లు యాజమాన్యంతో భరత్‌రామ్‌ చీకటి ఒప్పందం

కార్మికులకు భరోసా ఇచ్చిన కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి

పేపరుమిల్లు యాజమాన్యంతో మార్గానిభరత్‌ రామ్‌ చీకటి ఒప్పందం పెట్టుకుని కార్మికులకు అన్యాయం చేశాడని రాజమహేంద్రవరం సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు అన్నారు. పేపరుమిల్లు యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించిన నేపథ్యంలో కార్మికులను కలిసి వారికి అండగా నిలిచేందుకు గురువారం ఉదయం వారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి, టీఎన్‌టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, నగర అధ్యక్షుడు నల్లం శ్రీను, టీడీపీ పార్లమెంట్‌ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, మాజీ కార్పొరేటర్‌ మొకమాటి సత్యనారాయణలు మిల్లు వద్దకు చేరుకున్నారు. కార్మికులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మిల్లు కార్మికుల హక్కులకు భంగం కలిగినా, సమస్యలు పరిష్కరించకపోయినా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంవో కార్యాలయం నుంచి మిల్లు యాజమాన్యానికి ఫోనుచేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి చేయించేవారని కానీ ఈ ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం కార్మికుల సమస్యలు చెబితే మీకు జీతాలు ఎక్కువట కదా అని హేళనగా మాట్లాడారని కార్మికులే చెబుతున్నారన్నా రు. మరోపక్క భరత్‌రామ్‌ యాజమాన్యం నుంచి బ్యాగులు పట్టుకుపోయాడని అందుకే అతను ఇప్పటివరకు యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. పైగా కార్మికుల ముందుకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నాడన్నారు. భరత్‌ అనుచరుడు చిట్టూరి ప్రవీ ణ్‌చౌదరి మిల్లులో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు దోచుకున్నాడని ఆరోపించా రు.కూటమి అధికారంలోకిరాగానే కార్మికుల డిమాండ్‌ ప్రకారమే అగ్రిమెంట్‌ చేయిస్తామన్నారు.

అనపర్తి కెనాల్‌ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా

వేమగిరి సామర్లకోట రహదారిపై ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని పురందేశ్వరి సహాయంతో కేంద్రంతో మాట్లాడి పనులు పూర్తి చేస్తామని పాత ఉమ్మడి జిల్లా ప్రస్తుతం మూడు జిల్లాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించి రోడ్డు నిర్మాణం చేస్తామని అదేవిధంగా అనపర్తిలో అపరిస్కృతంగా ఉన్న పలు రైళ్ల నిలుపుదల విషయంలో కూడా జన్మభూమి సహా మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టులను సాధించి తీరుతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సత్తి దేవదానరెడ్డి, ఆళ్ల గోవిందు, తమలంపూడి సుధాకరరెడ్డి, సిరపల్లి నాగేశ్వరరావు, కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, జుత్తుగ కృష్ణ, వెలుగు బంటి సత్తిబాబు, త్రిమూర్తులు, జనసేన నాయకుడు రావాడ నాగు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనపర్తిలో ఎన్డీయే కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి

నియోజకవర్గ ఎన్డియే కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కూటమి విజయా నికి కృషిచేయాలని పలువురు నేతలు సూచించారు. బలభద్రపురం ఎమ్‌ఎస్‌ఆర్‌ కళ్యాణ మండ పంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రసంగిస్తూ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మూడుపార్టీల కార్యకర్తలపై ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున కూటమిలో గుర్తు మార్పు అంశంపై ప్రజల్లోకి ప్రచారం వెళ్ళాలని అసెంబ్లీ పార్లమెంట్‌ అభ్యర్ధులు ఇద్దరికీ కమలం గుర్తు రావడం ప్రచారానికి కొంత సులభంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుజయ్‌కృష్ణ రంగారావు, పడాల వెంకటరామారెడ్డి, బీజేపీ రాష్ట్ర యువమోర్చా ప్రదాన కార్యదర్శి ములగపాటి శివరామకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు. .

జన సందోహం మధ్య భారీ ర్యాలీగా నామినేషన్‌ వేసిన నల్లమిల్లి

అనపర్తి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున నల్లమిల్లి నామినేషన్‌ కార్యక్రమం గురువారం విజయవంతంగా పూర్తయింది. సుమారు 15 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో నల్లమిల్లి వెంట వేలాదిగా అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. రామవరం, అనపర్తి గ్రామాలలో క్రేన్‌ సహాయంతో భారీ గజమాలలు వేసి స్వాగతం పలికారు. అదేవిధంగా అనపర్తిలోని పాతవూరి మసీదు వద్ద నల్లమిల్లికి స్వాగతం పలికిన ముస్లిం సోదరులు నల్లమిల్లి విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థన నిర్వహించి నల్లమిల్లి, దగ్గుబాటిలను ఆశీర్వదించారు. అనపర్తికి చేరుకున్న ర్యాలీకి తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి నల్లమిల్లికి బూడిద గుమ్మడి కాయలతో హారతిచ్చి దిష్టి తీశారు. అనంతరం ఆర్వో కార్యాలయం చేరుకుని బీజేపీ అభ్యర్ధిగా తన నామినేషన్‌ పత్రాలతోపాటుగా బిఫారమ్‌కు అందజేశారు. అనంతరం మీడియా తో మాట్లాడిన నల్లమిల్లి జగన్‌ రహిత రాష్ట్రం కోసం ఏర్పడిన కూటమి విజయమే లక్ష్యంగా తాను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. జెండా ముఖ్యంకాదని మూడు పార్టీల అజెండానే ముఖ్యమన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్ని తనను పోటీ లో లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలు చేశారో ప్రజలందరూ గమనించారని చివరకు తాను పోటీలో నిలిచేసరికి నోళ్లు పెగలడం లేదన్నారు. కూటమి విజయానికి జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు కలసికట్టుగా పనిచేస్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో తాను విజయం సాధించడమే కాకుండా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న పురందేశ్వరిని కూడా గెలిపించి తీరుతామని అన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:03 AM