Share News

అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:44 AM

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభు త్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనా రాయణ అన్నారు.

  అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

పి.గన్నవరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభు త్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనా రాయణ అన్నారు. మండలంలోని పలు గ్రామా ల్లో పల్లె పండుగలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీ శివారు గ్రామాలకు పక్కా రహదారులను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేపట్టిందన్నారు. అనంతరం లంకలగన్నవరంలో రూ.15లక్షలు, మొండెపు లంకలో రూ.5లక్షలు, నాగుల్లంకలో రూ.25లక్షలు, వాడ్రేవుపల్లిలో రూ.15లక్షలు, మానేపల్లిలో రూ.5 లక్షలు, ఆర్‌.ఏనుగుపల్లిలో రూ.10 లక్షలు, కె.ఏనుగుపల్లిలో రూ.10 లక్షలు, వై.కొత్తపల్లిలో రూ.5లక్షలు, కె.ముంజ వరంలో రూ.10లక్షలు నిధులతో అభివృద్ధి చేయనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నియో జకవర్గ కోఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ నామన రాంబాబు, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, ఎంపీడీవో కేవీ ప్రసాద్‌, నియోజకవర్గ పరిశీలకులు షేక్‌ సుభాన్‌, వైస్‌ ఎంపీపీ చెల్లి బోయిన గంగాదేవి, మట్టపర్తి రామకృష్ణ, సంసాని పెద్దిరాజు, కుమార్‌, తోలేటి సత్తిబాబు, సాధనాలు శ్రీవెంకటసత్యనారాయణ, యర్రంశెట్టి సాయిబాబు, శేరు శ్రీనుబాబు, యాండ్ర శ్రీని వాసరావు, అన్నాబత్తుల వెంకటేశ్వరావు, తాటికా యల శ్రీనువాసరావు, యడ్ల ఏసు, వివిధ గ్రామా ల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కూటమి నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:44 AM