అభివృద్ధికి పెద్దపీట: ఎమ్మెల్యే గోరంట్ల
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:13 AM
కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాజమహేంద్రవరంరూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం కడియం విజయ థియేటర్ వద్ద రూ.2లక్షల మండల నిధులతో కల్వర్టు వైండింగ్, బుర్రిలంకలో రూ.40లక్షలు (మండల నిధులు రూ.20 లక్షలు, పంచాయతీ నిధులు రూ.20లక్షలు)తో నిర్మించే సీసీరోడ్డు కమ్ డ్రైను, రూ.34లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించే కడియపులంక జాతీయ రహదారి సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం సమీపం నుంచి రోడ్డు నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు.

కడియం, జూలై 7: కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాజమహేంద్రవరంరూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం కడియం విజయ థియేటర్ వద్ద రూ.2లక్షల మండల నిధులతో కల్వర్టు వైండింగ్, బుర్రిలంకలో రూ.40లక్షలు (మండల నిధులు రూ.20 లక్షలు, పంచాయతీ నిధులు రూ.20లక్షలు)తో నిర్మించే సీసీరోడ్డు కమ్ డ్రైను, రూ.34లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించే కడియపులంక జాతీయ రహదారి సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం సమీపం నుంచి రోడ్డు నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలంలో ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా తాగునీరు, రోడ్లు, డ్రైన్లు వంటి అభివ ృద్ధి పనులకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు. జలమిషన్ ద్వారా ప్రతీఇంటికి సురక్షిత మంచినీరు అందించే యోచనలో ఉన్నామని అందుకోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రహదారులు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా సర్వే చేయించి పార్టీలకు అతీతంగా ఆక్రమణలు తొలగించి రోడ్లు విస్తరణ చేయించే చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మోసిగంటి సత్యవతి, వెలుగుబంటి ప్రసాద్, పాటంశెట్టి రాంజీ, పంతం గణపతి, అన్నందేవుల చంటి, వెలుగుబంటి నాని, చెల్లుబోయిన శ్రీనువాసరావు, గట్టి నర్సయ్య, ముద్రగడ జమీ, వరగోగుల వెంకటేశ్వరరావు, గట్టి సుబ్బారావు, నాగిరెడ్డి రామకృష్ణ, ఆదిమూలం సాయిబాబా, గుర్రపు సత్యనారాయణ, పితాని శివరామకృష్ణ, గోరు నాగేశ్వరరావు, షేక్ సిద్దయ్య, మండల జేఈ త్రిమూర్తులు పాల్గొన్నారు.
కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది
16వ డివిజన్ సత్కార సభలో ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం సిటీ, జూలై 7: తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎంతో కష్టపడిన కార్యకర్తలు రుణం ఏమిచ్చి తీర్చుకోగలనని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేద్రవరం 16వ డివిజన్‌లో ఆదివారం టీడీపీ ఇన్‌చార్జి చలుమూరి సత్యనారాయణ, కుమారుడు అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో గోరంట్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 17వ డివిజన్ ఇన్‌చార్జి రొంపిచర్ల ఆంటోని అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఇంత అభిమానం చూపుతున్న కార్యకర్తలకు సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు. స్థానిక ప్రజలకు కమ్యూనిటీ హాలు, హైస్కూల్, అర్హులకు గృహాలు, మేజర్ డ్రైనేజీలు, క్లీనింగ్ వంటి పనులన్నీ త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్, మత్సేటి ప్రసాద్, బూర దుర్గాంజనేయరావు, మానుపాటి తాతారావు, యేలూరి వెంకటేశ్వరరావు, సూరంపూడి శ్రీహరి పాల్గొన్నారు.
‘చైతన్యనగర్ పాఠశాలను అప్‌గ్రేడ్ చేయించాలి’
కడి యం, జూలై 7: కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీలో చైతన్యనగర్‌లో ఉన్న పాఠశాలలో పదో తరగతి వరకు పిల్లలు చదువుకునేలా అప్‌గ్రేడ్ చేయించాలని ఆదివారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి, ఎంఆర్ పాలెం సర్పంచ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అన్నందేవుల చంటి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ చైతన్యనగర్‌లో ఎక్కువగా పేద, మధ్యతరగతితో పాటు పేపరుమిల్లులో పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ప్రజ లు ఉన్నారన్నారు. వీరి పిల్లలు పదో తరగతి చదువుకోవాలంటే సుమారు 3 కిలోమీటర్ల మేర అటు కడియం, ఇటు ఎంఆర్‌పాలెం వచ్చి చదువుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపఽథ్యంలో చైతన్యనగర్ పాఠశాలను పదోతరగతి వరకు ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయించాలని ఎమ్మెల్యే గోరంట్లను, సర్పంచ్ చంటి కోరారు.
‘పారిశుధ్య పనులు
మెరుగ్గా నిర్వహించాలి’
ధవళేశ్వరం, జూలై 7: గ్రామంలో పారిశుధ్య పనులు మెరుగ్గా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయం లో కార్యదర్శి సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నాయకుడు మార్ని వాసుదేవరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు పం డూ రి అప్పారావు, యర్రమోతు ధర్మరాజు, ఆళ్ళ ఆనందరావు, తలారి మూర్తి, తదితరులు మాట్లాడుతూ స్పెషల్‌డ్రైవ్ చేపట్టే ప్రాంతాల్లోని కూటమి నాయకుల తో సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. నాళ్ళ రమేష్, సావాడ శ్రీనివాస రెడ్డి, బీరా ప్రకాష్, వర్రే రమేష్, వర్రే చిన్ని, పన్నాల లక్ష్మి పాల్గొన్నారు.