Share News

ప్రజాస్వామ్య పంచ్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:53 AM

ఒకే ఒక్క చాన్స్‌ అంటూ ఐదేళ్లు వంచన చేసిన జగన్‌ పాలనపై ప్రజా స్వామ్య బటన్‌ జనం పంచ్‌లు కురిపించారు. రాజకీయ నియంతలకు చరిత్రలో గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పారు. వైనాట్‌ 175 అంటూ విర్రవీగిన బరితెగింపునకు తెరదించేశారు.

ప్రజాస్వామ్య పంచ్‌

పంకా పరార్‌.. గాలోరు గల్లంతు

బటన్‌తోనే జగన్నాటకానికి తెర

జిల్లాలో టీడీపీకి ఓట్ల వరద

ఇదో చరిత్రే కాదు కేస్‌ స్టడీ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఒకే ఒక్క చాన్స్‌ అంటూ ఐదేళ్లు వంచన చేసిన జగన్‌ పాలనపై ప్రజా స్వామ్య బటన్‌ జనం పంచ్‌లు కురిపించారు. రాజకీయ నియంతలకు చరిత్రలో గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పారు. వైనాట్‌ 175 అంటూ విర్రవీగిన బరితెగింపునకు తెరదించేశారు. ఓటుతో చాచి కొడితే అధికారంతోపాటు ప్రతిపక్షం హోదా కూడా గాలిలో కలిసిపోయింది. జగన్‌ అధికారం చేపట్టిన మరుసటి రోజున ప్రజావేది కతో మొదలు పెట్టిన విధ్వంసం రాజధాని అమరావతినీ నాశనం చేసింది. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటతో అధికారం గడిపేశారు. చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ప్రతి రంగాన్నీ కెలికిపడేశారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. తెల్లారితే అప్పు పుడితేనేగానీ ప్రభుత్వం నడవలేని దుస్థితిని తీసుకొచ్చారు. తొలిసారిగా ప్రభుత్వోద్యోగులు జీతం మహాప్రభో అనే పరిస్థితి తీసుకొచ్చారు. అంగన్వాడీలతోసహా అందర్నీ రోడ్డెక్కించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. వారిపై దాష్టీకానికి తెరతీశాడు. అమరావతిని నాశనం చేయడంతో పాటు ఐటీ కంపెనీలు పారిపోయేలా చేశాడు. దీంతో ఐటీ చదివిన పిల్లలు పొట్టచేత పట్టుకుని ఉపాధి వెతుక్కుం టూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. అధికారం చివరిలో మెగా డీఎస్సీ అంటూ మెగా దగా చేశాడు. పోలీసుశాఖను తన సొంత పనులకు, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడానికి వాడు కున్న జగన్‌ పోలీసులకు సరెండర్‌ లీవు డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. బందోబస్తులకు వెళ్లేప్పుడు ఇచ్చే అడ్వాన్సు టీఏలనూ ఎత్తేశాడు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటీ చెప్పుకోదగిన పరిశ్రమలు రాలేదు. జిల్లాలోని రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌కి ఏ రకమైన మేలూ జరగలేదు. మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి మాటేలేదు. పైగా కొండలూ, గుట్టలు, చెరువులూ వంటి ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు మింగేశారు. అక్రమానికి కొత్త భాష్యం చెప్పారు. జిల్లాలో ప్రధా నమైన వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు. డొక్కు బస్సులు, గుంతల రోడ్లతో ఐదేళ్లుపాటు ప్రజలు నరకం చూశారు. మద్యం పాలసీ అయితే మరీ దారుణం అని చెప్పొచ్చు. మందుబా బుల జేబులను గుల్లచేస్తూ ఆర్థికంగా చితికిపోయేలా చేసింది. నాసిరకం మ ద్యానికి పేదలు బలైపోయారు. లివర్‌, గుండె, జీర్ణాశయ సం బంధిత వ్యాధులు ఎక్కువై ఆస్పత్రుల పాలయ్యారు. ఆరోగ్యశ్రీ గాడితప్పడంతో బాధితులు అప్పుల్లో మునిగి పోయారు. ఐదేళ్లలో జగన్‌ ప్రజల మధ్యలోకి వచ్చిన సందర్భంలేదు. మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడింది లేదు. సంక్షేమ పథకాలంటూ మహిళ లను ముప్పు తిప్పలు పెట్టాడు. రాజకీయ ఆర్భాటం కోసం సచివాల యాలను, వలంటీరు వ్యవస్థను సృష్టించి ఇబ్బందులకు గురిచేశాడు. ఇవన్నీ ఓ ఎత్తయితే.. చంద్రబాబును జైలుకు పంపించి రాజకీయాల చరిత్రలో హీనుడుగా మిగిలి పోయాడు. రాష్ట్రానికి ఎన్నడూలేని జాడ్యానికి తెరలేపి 53రోజులపాటు చంద్రబా బును మానసిక వేదనకు గురి చేశాడు. ఒక వెకిలిచేష్టల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ఎక్కువ ఆరోగ్యం అనే విధంగా పరిస్థితి దాపురించింది. అసెంబ్లీ పరువును ప్రతిక్షణం తీసేశారు. ఆంధ్రా అంటే ఇతర రాష్ట్రాల వాల్లు అయ్యో పాపం అంటూ జాలి చూపే స్థాయి కి దిగజార్చేశాడు. ఇలాంటి దుశ్చర్యలు ఎన్నో గుండెల్లో రగిలిపోతున్నా పోలింగ్‌ రోజు కోసం ఓపికగా ఎదురుచూసిన ఓటరు పీఠం పీకేశాడు. నా వల్ల మంచి జరిగితే ఓటు వేయ ండంటూ ఎన్నికల సమయంలో జగన్‌ పదే పదే ప్రక టించేవాడు. మంగళవారం ఫలితాలు చూస్తే పూర్తిగా జగన్‌కి జనం మంగళం పాడేశారు. అంటే నీ వల్ల మంచి కాదు.. కీడు చాలా జరిగిందని ఓటుతో మౌ నంగా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు జవాబుదారులుగా కాకుండా జమిందారులుగా విర్రవీగితే తాట తీస్తామని చెప్పకనే చెప్పారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల ఫలితాలు కేస్‌స్టడీగా మిగిలిపోతాయనడంలో సందేహంలేదు. గతంలో జరిగిన తప్పు మరోసారి జరగకూడదనుకున్న ప్రజలు టీడీపీని ఓట్లతో నిలువెత్తునా తడిపేశారు. తాము కోరుకున్న ‘మార్పు’ను ప్రజలు ప్రభంజనంలా చూపించారు. దీంతో రాష్ట్రం మళ్లీ వెలుగువైపు పయనిస్తుందనే ఆనందం నలుదిశలా వ్యక్తమవుతోంది. జనాలకు భయం గాలిలో కలిసిపోయి బంగారు భవిష్యత్తు కళ్లల్లో కదలాడుతోంది.

ఫలించని ప్రత్యర్థి ఎత్తులు

ఎత్తుకు పైఎత్తు వేసిన ఓటర్లు

ఒకే పేరున్న అభ్యర్థులను బరిలో నిలిపిన ప్రత్యర్థులు

కూటమి అభ్యర్థి అత్యధిక మెజార్టీ గెలుపు

రాజానగరం/దివాన్‌చెరువు, జూన్‌ 4: సార్వత్రిక ఎన్నికల్లో ఒకే పేరు గల అభ్యర్థులను బరిలో దించి ప్రయోజనం పొందవచ్చని ప్రత్యర్థులు వేసిన ఎత్తులను ఓటర్లు చిత్తు చేశారు. ఓటర్లంటే మీరు అనుకేనేంత అమాయకులం కాదంటూ తాము నిర్ణయించుకున్న అభ్యర్థికి ఆచితూచి ఓటు వేశారు. తామూ సిద్ధహస్తులమే అంటూ రాజానగరం నియోజకవర్గ ఓటర్లు నిరూపించుకున్నా రు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో నిలిచారు. వీరికి గాజు గ్లాసు గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. అలాగే ఇదే పేరు గల స్థానికేతరులైన వేర్వేరు అభ్యర్థులు పోటీ చేశారు. ఈవీఎంలో కూటమి అభ్యర్థికి వరుస సంఖ్య 5లో గాజు గ్లాసు గుర్తు కేటాయించగా, మిగిలిన ఇద్దరు బలరామకృష్ణులకు వరుసగా 6, 7 క్రమంలో గాజు గ్లాసును పోలిన గుర్తులు కేటాయించారు. దీంతో ఓటర్లు తికమక పడి తమకు ప్రయోజనం చేకూరుతుందని ప్రత్యర్థులు భావించారు. కానీ పోలింగ్‌ జరిగిన మూడు వారాల అనంతరం మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే ప్రత్యర్థులకు నిరాశే మిగిలింది. ఇద్దరు అభ్యర్థుల్లో జాతీయ జనసేన పార్టీ తరపున పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణకు 844 ఓట్లు, అలాగే నవరంగ కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో నిలిచిన మరో బత్తుల బలరామకృష్ణకు 1091 ఓట్లు లభించాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బత్తుల వెంకటలక్ష్మికి 1075 ఓట్లు వచ్చాయి. అయితే కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ 16 వరకు ప్రతీ రౌండ్‌లోనూ తన ఆధిక్యతను కనబరుస్తూ 34,048 ఓట్లు మెజార్టీతో బత్తుల విజయం సాధించారు. ఇదిలా ఉండగా నోటా కూడా ప్రతి రౌండ్‌లోనూ కొన్ని ఓట్లను సాధిస్తూ వచ్చింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 2975 ఓట్లను సాధించింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, కూటమి అభ్యర్థులను మినహాయిస్తే ఎన్నికల బరిలో నిలిచిన మిగిలిన అభ్యర్ధులెవరికీ ఇన్ని ఓట్లు లభించకపోవడం గమనార్హం.

Updated Date - Jun 05 , 2024 | 12:53 AM