Share News

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:19 AM

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఓటరు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించు కునే వాతావరణం కల్పించడం ప్రభుత్వ యంత్రాం గం విధి అని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర పోలీసు ప్ర త్యేక అబ్జర్వర్‌ దీపక్‌మిశ్రా పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం

పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఓటరు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించు కునే వాతావరణం కల్పించడం ప్రభుత్వ యంత్రాం గం విధి అని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర పోలీసు ప్ర త్యేక అబ్జర్వర్‌ దీపక్‌మిశ్రా పేర్కొన్నారు. జిల్లా పర్య టనలో భాగంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీశ్‌ తదితర అధికారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా మిశ్రా మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటువేసేలా పోలీసు వ్యవస్థ విధులు నిర్వర్తించాల న్నారు. జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో నిర్వహించే విధు లు ఎంతో కీలకమన్నారు. ఎలాంటి భేదభావాలు లేకుండా పోలీసులు పనిచేయాలని ఆయన పేర్కొ న్నారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ముందస్తు గా ప్రణాళిక ప్రకారం భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటరు స్లిప్పుల పంపిణీ, హోమ్‌ ఓటింగ్‌పై తీసుకున్న చర్యలపై పలు సూచనలు చేశారు. ఫేక్‌ న్యూస్‌ విషయంలో తక్షణం స్పందించా లని సూచించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యల గురించి మిశ్రాకు కలెక్టర్‌ మాధవీ లత వివరించారు. ఎస్పీ జగదీశ్‌ మాట్లాడుతూ జిల్లాలో 175 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్స్‌లో 405 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నా రు. తగు విధంగా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటికే 88 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశామని, బైండోవర్‌కి సంబంధించి 943 కేసులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లపై 29 కేసులు నమోదు చేశామన్నారు. సమా వేశంలో ఆదనపు డీజీపీ శంకబ్రత బాగ్చి, జేసీ తేజ్‌ భరత్‌, జిల్లా ఎన్నికల పరిశీలకులు అరవింద్‌, వ్యయ పరిశీలకులు రోహిత్‌నగర్‌, జై అరవింద్‌, నితిన్‌ కురి యన్‌, అదనపు ఎస్పీ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

ఫ ఎన్నికల పరిశీలకుడు బాలసుబ్రహ్మణ్యం

అనపర్తి, ఏప్రిల్‌ 29: అనపర్తి నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సా రించాలని ఎన్నికల పరిశీలకుడు కె. బాలసుబ్రహ్మ ణ్యం అన్నారు. సోమవారం ఆయన అనపర్తిలో ఆ ర్వో కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అనపర్తి కెనాల్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు ను పరిశీలించిన ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని కొప్పవరంలో గత ఎన్నికలలో వివాదం చోటుచేసుకున్న పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్వో మాధు రితో పలు అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన వెంట తహసీల్దార్‌ సునీల్‌బాబు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకే నిర్వహణ

ఫ ఎన్నికల పరిశీలకుడు వివేకనందన్‌

రంపచోడవరం, ఏప్రిల్‌ 29: త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల సంఘం నిబంధనల మేరకే నిర్వహిస్తామని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.వివేకనందన్‌ రాజకీయ ప్రతినిధులను విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన పాడేరు జిల్లా కలెక్టరు కార్యాలయం నుంచి రంపచోడవరం నియోజకవర్గంలో పోటీలో ఉన్న 12 మంది అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వచ్చేనెల 3, 4, 5వ తేదీలలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కమీషనింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలు వీడియో గ్రాఫింగ్‌ చేయించాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి ఎం.విజయసునీత మాట్లాడుతూ మే 13వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు. రంపచోడవరం అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించారు. కార్యక్రమంలో తహశీల్దారు ఎ.కృష్ణజ్యోతి, డీటీలు శ్రీధర్‌, శివ, రాజు, విశ్వనాధ్‌, బాలాజీ, చైతన్య, సరిత, సత్యనారాయణ, వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

.

Updated Date - Apr 30 , 2024 | 01:19 AM