Share News

చనిపోయినా..బతికే!

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:49 AM

ఓటర్ల జాబితాలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.. అవాక్కయి పో తున్నారు.ఎందుకంటే చాలా చోట్ల ఎప్పుడో చనిపో యిన ఓటర్లే ఎక్కువగా దర్శనమిస్తున్నారు.

చనిపోయినా..బతికే!
దేవరపల్లి మండలం కురుకూరు తుది ఓటరు జాబితాలో ప్రచురితమైన 10 మంది చనిపోయిన వారి ఓట్లు

అవాక్కవుతున్న కుటుంబీకులు

తప్పులతడకగా తుది జాబితా

పరిశీలనపై అనుమానాలు

తొలగించాలని డిమాండ్‌

ఓటర్ల జాబితాలో సిత్ర విసిత్రాలు

గోపాలపురం, ఫిబ్రవరి 6 : ఓటర్ల జాబితాలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.. అవాక్కయి పో తున్నారు.ఎందుకంటే చాలా చోట్ల ఎప్పుడో చనిపో యిన ఓటర్లే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. అయి నా మార్పులపై అధికారులేం ప్రకటన చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో బీఎల్‌ వోల పని తీరులో మార్పు రాలేదనడానికి ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా ఉండడమే నిదర్శనం. వాదాలకుంట 26 పోలింగ్‌ కేంద్రంలో గత కొన్నేళ్ల కిందట గ్రామాన్ని విడిచి వెళ్లిన వీవీఎస్‌ఎస్‌ దత్తు యారమిల్లి ఓటు నేటికి ఓటర్ల జాబితాలో తొల గించడం కానీ ఆ ఓటును ఓటర్ల జాబితా నుంచి బదిలీ చేయడం కానీ జరగలేదు. కరిచర్ల గూడెం 23వ బూత్‌లో చిరిచోళ్ళ వెంకటలింగం తో పాటు మరో 23 మంది ఓటర్లు కొన్ని నెలల కిందట మృతిచెందారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వహించ డంతో పాటు మార్పులు, చేర్పులు సవరణల్లో ఓటు నమోదు,మృతిచెందిన వారి పేర్లు తొలగించేం దు కు ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వ హించినప్పటికిక్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు లో మాత్రం మార్పు రాలేదు.దీంతో 23 పోలింగ్‌ బూత్‌లో మృతి చెందిన వారి సంఖ్య 24, తమ పోటోలు తామే గుర్తించలేని ఓట్లు 8 ఉన్నాయి.

కురుకూరులో 10 ఓట్లు..

దేవరపల్లి, ఫిబ్రవరి 6 : దేవరపల్లి మండలం కురుకూరులో 1200 ఓట్లు ఉండగా సగం జాబి తా పరిశీలించేటప్పటికే 10 మంది మృతుల ఓట్లు తొలగించలేదు. చిన్న గ్రామమైన కురు కూరులో బీఎల్‌వో,వీఆర్వోలు ఓట్ల తొలగింపులో నిర్లక్ష్యవైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మండలంలోని అన్ని గ్రా మాల్లో తప్పుల తడకలుగా ఓటర్ల జాబితా దర్శన మిస్తున్నాయి. కురుకూరు గ్రామంలో సూర్యచం ద్రం ఆలపాటి, కృష్ణారావు కొయ్యలమూడి, రాజా రావు బేతిన, అన్నపూర్ణ కొయ్యలమూడి, రామకృష్ణ కొయ్యల మూడి,వెంకటరత్నం బేతిన, లక్ష్మికాంతం మల్లెల, శ్రీరామకృష్ణారావు బేతిన, సక్కుబాయి నల్లూరి, సీతారత్నం ముక్కాముల చాలా కాలం కిందట చనిపోయారు. ప్రస్తుతం ఆ పది మంది ఆత్మలకు ఓట్లు ఉన్నాయి. అధికారులు వెంటనే మృతుల ఓట్లు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:49 AM