మైనార్టీలకు ఇచ్చే గౌరవమిదేనా?
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:11 AM
పిఠాపురం, మార్చి 5: తనను వేదికకు పైకి ఆహ్వానించకపోవడంపై డీసీసీబీ డైరెక్టర్ సయ్యద్ మొహిద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. గొల్లప్రోలు పట్టణంలోని ఒక పంక్షన్‌హాలులో మంగళవారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి వైసీపీ పోలింగ్‌బూత్ కన్వీనర్ల స

ప్రశ్నించిన డీసీసీబీ డైరెక్టరు మొహిద్దీన్
పిఠాపురం, మార్చి 5: తనను వేదికకు పైకి ఆహ్వానించకపోవడంపై డీసీసీబీ డైరెక్టర్ సయ్యద్ మొహిద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. గొల్లప్రోలు పట్టణంలోని ఒక పంక్షన్‌హాలులో మంగళవారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి వైసీపీ పోలింగ్‌బూత్ కన్వీనర్ల సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చలమలశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజ రు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో గీత, సునీల్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వం అమలు చే సిన సంక్షేమ పథకాలపై వారికి వివరించాలని సూచించారు.