Share News

11న వేమగిరిలో దళిత గర్జన

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:29 AM

దళితులను అన్నివిధాల మోసం చేసిన సీఎం జగన్‌కు ఈనెల 11న వేమగిరిలో నిర్వహించే దళిత సింహగర్జన సభ కనువిప్పు కలిగించబోతుందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ అన్నారు.

11న వేమగిరిలో దళిత గర్జన

రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌ ఫిబ్రవరి 6: దళితులను అన్నివిధాల మోసం చేసిన సీఎం జగన్‌కు ఈనెల 11న వేమగిరిలో నిర్వహించే దళిత సింహగర్జన సభ కనువిప్పు కలిగించబోతుందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌ తనయుడు జీవీ శ్రీరాజ్‌ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన దళిత జాతులకు మేలు చేస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక జగన్‌ పూర్తిగా దళితులను నిర్లక్ష్యం చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి సబ్‌ప్లాన్‌ నిధులను నవరత్నాల పేరుతో దారి మళ్లించారని, మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌ అంటూ దళితులను విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పటికైన దళిత జాతి వర్గాలు మేల్కొని తమ నిరసన గళం వినిపించాలని శ్రీరాజ్‌ పేర్కొన్నారు. హర్షకుమార్‌ నేతృత్వంలో వేమగిరిలో జరిగే దళిత గర్జన సభలో దళితులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సింహగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. దళిత నాయకులు వరిగేటి కిరణ్‌, కొమ్ము ప్రభాకర్‌రావు, తెనాలి కిరణ్‌, ఇండుగుమిల్లి చిరంజీవి, పసలపూడి పాపారావు, పౌరోజు మాణిక్యాలరావు, తాతపూడి సత్యనారాయణ, ఫౌరోజు చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:30 AM