Share News

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:12 AM

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలిసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంతూర్‌ సోప్స్‌ సంస్థ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్కృత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

  • కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రత్నకుమారి

  • పలుచోట్ల సంక్రాంతి ముందస్తు సంబరాలు

కొవ్వూరు, జనవరి 13: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలిసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంతూర్‌ సోప్స్‌ సంస్థ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్కృత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని వివిద ప్రాంతాలకు చెందిన మహిళలు అధికసంఖ్యలో పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణేతలుగా మట్టే చైతన్య, ఏచూరి విజయ స్పందన వ్యవహరించారు. విజేతలకు రత్నకుమారి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్దుల సత్యనారాయణ, కౌన్సిలర్‌ పాలూరి నీలిమ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తాడిమళ్ల విజయవాణి, సుభాషిణి, మద్దుల సత్యనారాయణ, వి.ప్ర సాద్‌, పి.రామారావు, హెచ్‌ఎం జీఎస్‌ మూర్తి పాల్గొన్నారు. అలాగే 19వ వార్డు ఇందిరమ్మకాలనీలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీ రామారావు ఆధ్వ ర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్న పిల్లలకు భోగిపల్లు పోశారు. భోగి మంటలు వేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డేగల రాము, కె.నవ్య, గంగుమల్ల స్వామి, తేజ, అచ్యుతరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 01:12 AM