Share News

సీటీఆర్‌ఐలో రైతు అవగాహన సదస్సు

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:30 AM

: రాజమహేంద్రవరం సిటీఆర్‌ ఐలో శుక్రవారం సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ ప్రాంతీయ పరిశోధనస్థానం హైదరాబాద్‌ వారు ఐసీఏఆర్‌- ఎన్‌ఐఆర్‌సీఏ కృషివిజ్ఞాన కేంద్రం కలవచర్ల సౌజన్యంతో ఔషద, సుగంధ మొక్కల పెంపకం, ప్రాథమిక ప్రాసెసింగ్‌, నాణ్యత, విలువ జోగింపు, మార్కెటింగ్‌ అంశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు

సీటీఆర్‌ఐలో రైతు అవగాహన సదస్సు

రాజమహేంద్రవరం రూరల్‌, ఫిబ్రవరి 16: రాజమహేంద్రవరం సిటీఆర్‌ ఐలో శుక్రవారం సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ ప్రాంతీయ పరిశోధనస్థానం హైదరాబాద్‌ వారు ఐసీఏఆర్‌- ఎన్‌ఐఆర్‌సీఏ కృషివిజ్ఞాన కేంద్రం కలవచర్ల సౌజన్యంతో ఔషద, సుగంధ మొక్కల పెంపకం, ప్రాథమిక ప్రాసెసింగ్‌, నాణ్యత, విలువ జోగింపు, మార్కెటింగ్‌ అంశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ మాగంటి శేషుమాధవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ పరిశోధన కేంద్ర హైదరాబాద్‌ శాస్త్రవేత్త జె.కొటేష్‌ కుమార్‌, సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెంటిస్ట్‌ జి.కిరణ్‌బాబు, చీఫ్‌ సైంటిస్ట్‌ కేవీఎన్‌ సత్యశ్రీనివాస్‌, శాస్త్రవేత్తలు కేవీకే అధికారులు, ఎఫ్‌పీవో సభ్యులు, రైతులు, ఏపీ సీఎన్‌ఎఫ్‌ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. సుగంధ ఔషధ మొక్కల ఉత్ప త్తులు విలువ, గ్రేడింగ్‌, మార్కెంటింగ్‌పై అవగాహన కల్పించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో 10వేల హెక్టార్లలో సాగవుతుందని వివరించారు. ఈ పంటల వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. నిమ్మగడ్డి రూట్‌, కట్టింగ్స్‌, పామరోజా విత్తనం సుగంధ తైలాలను, అశ్వగంధ విత్తనాన్ని శాంపిల్‌ కిట్స్‌ రైతులకు ఉచితంగా అందించారు. సదస్సులో వివిధ మండలాల నుంచి అభ్యుదయ రైతులు, కేవీకేస్టాఫ్‌ సత్యవాణి, దిలీప్‌, రాజు, విజయ వర్దన్‌, ప్రభాత్‌నాయుడు, ఆర్‌.రత్నాజీ పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:30 AM