సైబర్ నేరాలు పెరిగాయి..
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:35 AM
జిల్లాలో సైబర్, చీటింగ్ నేరాలు మినహా క్రైమ్ రేటు దాదాపుగా తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ అన్నా రు

7437 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు
282 మంది మృత్యువాత
జిల్లా ఎస్పీ నరసింహకిశోర్
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 30( ఆంధ్రజ్యోతి): జిల్లాలో సైబర్, చీటింగ్ నేరాలు మినహా క్రైమ్ రేటు దాదాపుగా తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ అన్నా రు.రాజమహేంద్రవరం జాంపేట పోలీస్ కల్యా ణ మండపంలో సోమవారం జరిగిన సమావేశంలో 2023-24 ఏడాదికి సంబంధించి క్రైం వార్షిక నివేదికను సోమవారం వెల్లడించారు. చీటింగ్ కేసులు 2023లో 346 కేసులు నమోదు కాగా 2024లో 355 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 03 శాతం మేర పెరిగింది. సైబర్ నేరాల విషయానికి వస్తే 2023లో 120 కేసులు నమో దు కాగా 2024లో 140 కేసులు నమోద య్యా యి. ఇది గత యేడాదితో పోల్చితే 17శాతం మేర కేసులు పెరిగాయి. జిల్లాలో 2023 ఏడాదితో పోల్చితే ఎఫ్‌ఐఆర్‌ల నమోదు 0.8 శాతం తగ్గింది. గతేడాది 8079 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా ఈ ఏడాది 7437 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.పీజీఆర్‌ఎస్‌లో 1721 ఫిర్యాదులను ఎస్‌పి స్వీకరించారు. గతేడాది 1897 ఫిర్యాదులు వచ్చా యి. ఈ ఏడాది 0.9 శాతం తగ్గింది. జిల్లాలో ఈ ఏడాది జరిగిన 789 రోడ్డులో ప్రమాదాల్లో 282 మంది మృతిచెందారు. 845 మంది గాయపడ్డారు.2023తో పోల్చితే రోడ్డు ప్రమాదాల సంఖ్య 18 శాతం తగ్గింది. జిల్లాలో అదృశ్యం కేసులు 641 నమోదు చేశారు. బాలురు 31 మంది, బాలికలు 145 మంది, మేజర్ వ్యక్తులు 207 మంది, మహిళలు 258 మంది ఉన్నారు. ఇందులో 544 కేసులు ఛేదించారు. 97 కేసులు ఛేదించాల్సి ఉంది. గతేడాది మిస్సింగ్ కేసుల్లో 60 మందిని ఈ ఏడాది కనుగొన్నారు. అక్రమ మద్యం కేసులు 469 నమోదు కాగా సారాయి కేసులు 415 నమోదు చేశారు. మద్యం కేసుల్లో 472 మందిని, సారాయి కేసులో 418 మందిని అరెస్టు చేశారు.ఈ ఏడాది 2013.276 లీటర్ల మద్యం, 14.980 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నారు. హత్యానేరాలు తగ్గుముఖం పట్టాయి. 2023లో 24 హత్యలు జరగ్గా 2024లో 23 హత్యలు జరిగాయి.జిల్లాలో 855 దొంగతనాలు ల్లో రూ. 8,36,00,666 చోరీకి గురైంది. అయితే రూ.4,40,74,840 రికవరీ చేశారు. దోపిడీలు 30 శాతం తగ్గాయి. ఇంటి దొంగతనం కేసుల్లో 355 కేసులు చేధించారు. పగలు, రాత్రి పూట చోరీలు 16 శాతం తగ్గాయి.జిల్లాలో అత్యాచారాల కేసులు 890 నమోదయ్యాయి.2023లో 1032 కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది 14 శాతం మేర తగ్గాయి.ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు గతేడాది 101 నమోదు కాగా ఈ ఏడాది 101 నమోద య్యాయి.ఈ కేసుల్లో ఇప్పటి వరకు 70 మందికి రూ41,85,000 పరిహారం ఇప్పించడం జరిగింది. జిల్లాలో మోటర్ వాహన చట్టాన్ని ఉల్లంఘించిన 86117 మందిపై కేసులు నమోదు చేశారు. ి వీటిలో హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపిన వారిపై 42,562 కేసులే అధికం..జిల్లాలో డయల్ 112కు ప్రాధాన్యత పెరిగింది. గతేడాది డయల్ 112కు 15,483 కాల్స్ రాగా ఈ ఏడాది 18210 కాల్స్ వచ్చాయి. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మహిళ రక్షక్ టీమ్ జిల్లా వ్యాప్తంగా చాలా వేగంగా చైతన్యవంతం చేసింది. 6 బృందాలతో మహిళా రక్షక్ జిల్లాలో ఆపదలో ఉన్న మహిళలను రక్షిస్తుంది. మహిళా రక్షక్ టీమ్‌కు హెల్ప్ లైన్ నెంబరు 94932 06006 ద్వారా 50 ఫిర్యాదులు అందగా క్షణాలో చేరుకుని న్యాయం చేయగలిగారు.
ఈగల్‌తో గంజాయి కి చెక్
జిల్లాలో గతేడాది గంజాయి కేసులు 69 నమోదు కాగా 338 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5269.797 కేజీల గంజాయి స్వాధీ నం చేసుకుని 51 వాహనాలు సీజ్ చేశారు. 2024లో 65 కేసులు నమోదు కాగా 195 మం దిని అరెస్టు చేసి 2836.634 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 23 వాహనాలు సీజ్ చేశారు.రాష్ట్ర హోం శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ఈగల్ టీమ్ తో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు. ఒక సీఐ, ఒక ఎస్‌ఐ, ఆరుగురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా పని చేస్తారు.రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ఈ బృందాన్ని అమరావతి నుంచి రాష్ట్ర హోంశాఖ మోనటరింగ్ చేస్తుంది.