ప్రజల్లో విశ్వసనీయత పెంపొందాలి :
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:58 AM
పోలీసుశాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్క రూ విధులు నిర్వర్తించాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశించారు.

- డాక్టర్ రామగుర్రెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, అనపర్తి
రాజమహేంద్రవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలీసుశాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్క రూ విధులు నిర్వర్తించాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ నరసింహకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయ న నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహి రంగ మద్యపానం, తాగి వాహనాలు నడ పడంపై తనిఖీలు ముమ్మరం చేయాల న్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఇష్టానుసారం డ్రైవింగ్, మైనర్లు వాహనా లు నడపడంపై ప్రత్యేకంగా దృష్టి సారిం చాలని, డయల్ 112కి కాల్ వస్తే తక్షణమే స్పందించి సాధ్యమైనంత త్వరగా బాధి తుల వద్దకు చేరుకోవాలని చెప్పారు. సారా, గంజాయిపై ఉక్కుపాదం మోపా లన్నారు. అడిషనల్ ఎస్పీలు ఏవీ సుబ్బ రాజు, ఎన్‌బీఎం మురళీకృష్ణ పాల్గొన్నారు.