Share News

పండుగ విషాదం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:26 AM

సంక్రాంతి పండుగ ఆనందం ఆవిరైంది.. పలు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.. మద్యం మత్తు పలువురి ప్రాణాలు తీసింది..

పండుగ విషాదం
సజీవదహనమైన మృతదేహం పరిశీలన

పండుగకు వచ్చి ప్రమాదానికి గురి

కన్నీరు మున్నీరైన కుటుంబీకులు

4 కుటుంబాల్లో తీవ్ర విషాదం

సంక్రాంతి పండుగ ఆనందం ఆవిరైంది.. పలు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది.. మద్యం మత్తు పలువురి ప్రాణాలు తీసింది.. వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టి ఒకరు.. ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొట్టి మరొకరు మృతిచెందారు.. మరో యువకుడు పండుగకని మేనమామ ఇంటికి వెళుతూ బైక్‌ అదుపు తప్పిరోడ్డుపై పడి మృతిచెందాడు. మద్యం మత్తులో ఉన్న మరో వృద్ధుడు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ప్రమాదంలో సజీవదహన మయ్యాడు. ఇలా వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు.. అప్పటి వరకూ తమతో ఉన్న వారు ఇక లేరని తెలిసి కుటుంబీకులు బోరుమన్నారు.

బైక్‌ ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

కొవ్వూరు, జనవరి 16 : పండుగకు ఆనందంగా ఇంటికి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమా దంలో మృతిచెందాడు. కొవ్వూరు పట్టణానికి చెందిన యాదం దుర్గా నాగసాయి కుమార్‌ (27) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన ఇంటికి వచ్చాడు. 15వ తేదీన తండ్రి మోటారు సైకిల్‌ తీసుకుని రాజమహేంద్రవరం వెళ్లి వస్తానని బయలుదేరాడు. ఏజీఆర్‌బీ రోడ్‌పై ఆంధ్రా ఫామ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ ఎదురుగా వెనుకనుంచి వస్తున్న బైక్‌ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమార్‌ కిందపడి తలకు తీవ్రగాయాలయ్యాయి. 108 ఆంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం రాజమహేంద్రవరం తరలిస్తుండగా మృతి చెం దాడు. మృతుడి తండ్రి సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రాల బాబూరావు తెలిపారు. పండుగకు వచ్చిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక మాకు దిక్కెవరంటూ బోరుమన్నారు.

బైక్‌ అదుపు తప్పి ఒకరు..

దేవరపల్లి, జనవరి 16 : సంక్రాంతి పండుగను మావయ్య ఇంటి వద్ద జరుపు కుందామని బయలు దేరిన యువకుడు బైక్‌ ప్రమాదంలో మృతిచెందాడు. కోరుకొండ గ్రామానికి చెందిన పంపన విష్ణు తేజ(24) పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. సోమవారం ఉదయం కోరుకొండ నుంచి బైక్‌పై నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో ఉన్న తన మేనమామ వద్దకు సంక్రాంతి పండుగకు బయ లుదేరాడు. దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయరహదారి ఫ్లయ్‌ ఓవర్‌ వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. అతన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తర లించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. సం ఘటన ప్రాంతాన్ని సీఐ రామకృష్ణ పరిశీలించారు. మృతుడి మేనమామ తంగెళ్ల రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

అత్తవారింటికి వస్తుండగా బైక్‌ ఢీకొని మరొకరు..

దేవరపల్లి, జనవరి 16 : సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తవారింటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. గోపాలపురం మం డలం దొండపూడి గ్రామానికి చెందిన జాలిం వంశీకృష్ణ(25) బంధువుల శుభ కార్యా నికి వెళ్లి తిరిగి సంక్రాంతి పండుగ నిమిత్తం దేవరపల్లి మండలం యర్నగూ డెంలోని అత్తవారింటికి బయలుదేరాడు. కాసేపట్లో అత్తవారింటికి చేరుకుంటాడనే లోపునే ప్రమాదం జరిగింది. ఎదురుగా నిర్లక్ష్యంగా, అతివేగంగా వస్తున్న బైకు ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. దీంతో అతడిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందినట్టు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పట్టుకుని భార్య విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌.. వృద్ధుడి సజీవ దహనం

దేవరపల్లి, జనవరి 16 : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.పోలీసులు, బంధు వులు తెలిపిన వివరాల ప్రకారం. సీతానగరం మండ లం మిర్తిపాడు గ్రామానికి చెందిన సుంకర భీమ రాజు (73) తన భార్యతో 9 నెలల క్రితం దేవరపల్లి గ్రామంలో రైతు వద్ద కూలిపనికి వచ్చాడు. రైతు పొగాకు బేరన్‌ పక్కన ఉన్న రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మృతు డు గత మూడు రోజులుగా మద్యం సేవించి భార్యను కొడుతున్నాడు. మద్యం మా నేయాలని భార్య చెప్పినా వినలేదు.ఇదిలా ఉండగా సోమవారం రాత్రి 9 గం టలకు మళ్లీ మృతుడు విపరీతంగా సేవించి రావ డంతో ఎక్కడ కొడతాడోనని భార్య భయపడి పక్కింట్లో పడుకుందన్నారు. భీమరాజు మాత్రం తన షెడ్‌లో పడుకున్నాడు. అర్ధరాత్రి సమ యంలో షెడ్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. రాత్రి 11 గంటల సమయంలో స్థానికులు గమనించి మంటలు ఎగడిప డుతున్నాయని కేకలు వేశారు. దీంతో భార్య బయటకు వచ్చి చూసే సరికి మంటలు ఎగసిపడుతున్నాయి. భీమరాజు మంటల్లో చిక్కుకున్నాడని భార్య భోరున విలపించింది. షెడ్డులో బేరన్‌కు సంబంధించిన పురు కూసలు ఉండడం వల్ల మంటలు మరింతగా ఎగసి పడి భీమరాజు సజీవదహన మయ్యాడని పోలీసులు తెలిపారు.విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా షెడ్డుకు మంటలు అంటుకు న్నట్టు సమాచారం.సంఘటనా స్థలాన్ని సీఐ రామ కృష్ణ, ఎస్‌ఐ శ్రీహరిరావు పరిశీలిం చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలి పారు.

Updated Date - Jan 17 , 2024 | 12:27 AM