పెదనాన్నే కామ పిశాచి!
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:50 AM
పెదనాన్నే కామ పిశాచిగా మారి కుమార్తెను వేధిస్తున్న ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
రాజమహేంద్రవరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పెదనాన్నే కామ పిశాచిగా మారి కుమార్తెను వేధిస్తున్న ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా ఓ వివాహిత కొన్నేళ్లుగా తన ఇద్దరు కుమార్తెలతో దేవీచౌక్‌లో నివాసం ఉంటూ షాపుల్లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. పెద్ద కుమార్తె పది, రెండో కుమార్తె తొమ్మిది చదువుతున్నారు. అయితే ఇదిలా ఉండగా వివాహిత అక్క భర్త ప్రసాద్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుంటాడు. ఇదిలా ఉండగా ఈ నెల 18వ తేదీన వివాహిత ఇంటికి వచ్చేసరికి అతడు కంగారుగా పరిగె త్తుకుని వెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది.కుమార్తెను నిలదీయగా నాలుగు నెలల నుంచీ తనను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పిందని వాపో యింది.ఈ మేరకు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ పోక్సో కేసు నమోదు చేశారు.