Share News

ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్కింపు

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:44 AM

ముమ్మిడివరం అసెంబ్లీ నియోజ కవర్గ ఓట్ల లెక్కింపు శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్వామి వివేకానంద సెమినార్‌ హాలులో మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది.

ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్కింపు

ముమ్మిడివరం, జూన్‌ 3: ముమ్మిడివరం అసెంబ్లీ నియోజ కవర్గ ఓట్ల లెక్కింపు శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్వామి వివేకానంద సెమినార్‌ హాలులో మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. 268బూత్‌లకు సంబంధించి ఒక్కో రౌండుకు 14టేబుళ్లు ఏర్పాటుచేసి మొత్తం 20రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 2,45,296మంది ఓటర్లు ఉండగా 2,05,163 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి తరపున దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), వైసీపీ నుంచి పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి పాలెపు ధర్మారావుతో పాటు మరో 12మంది రంగంలో ఉన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూటమికి అనుకూలంగా ఉండడంతో గెలుపు తమదే అనే ధీమాలో వారున్నారు. నవరత్నాలు, ఓటింగ్‌ సరళిని బట్టి తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఽవైసీపీ ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి వారు అంచనాలతో కోట్లలో పందేలు కాసుకున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:44 AM